/rtv/media/media_files/2025/09/10/highway-closure-chokes-mutton-supply-in-kashmir-2025-09-10-10-33-20.jpg)
Highway closure chokes mutton supply in Kashmir
జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అక్కడ 20, 30 రకాల భక్ష్యాలతో 'వాజవాన్' అనే మాంసాహార వంటకాన్ని ప్రతీ వివాహ కార్యక్రమంలో వడ్డిస్తారు. ఈ ప్రత్యేక వంటకం లేకుంటే జమ్మూకశ్మీర్‌లో పెళ్లిళ్లు జరగలేవు. ఇప్పుడు ఇదే కశ్మీరీ వాసులకు తలనొప్పిగా మారింది. పర్వత ప్రాంతాలు, సొరంగాలతో కూడిన 250 కిలోమీటర్ల శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారి 44 అనేది వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల మూసిఉంది. గత 15 రోజుల నుంచి ఈ రహదారి నుంచి రాకపోకలు సాగడం లేదు.
Also Read: తాను తీసిన గోతిలో తానే..అమెరికా కంపెనీలను దెబ్బేసిన ట్రంప్ సుంకాలు
దీనివల్ల కశ్మీర్‌కు గొర్రెలు, మేకల సరఫరా ఆగిపోయింది. ఈ ప్రభావంతో మాంసం కొరత తీవ్రంగా ఏర్పడింది. సాధారణ రోజుల్లో ఢిల్లీ, హర్యానా, పంజాబ్ నుంచి ప్రతిరోజూ కశ్మీర్‌కు 50 ట్రక్కుల్లో గొర్రెలు సరఫరా అవుతుంటాయి. వాటిలో సుమారు 500 గొర్రెలు ఉంటాయి. ఇప్పుడు జాతీయ రహదారి మూసిఉండటంతో ఈ గొర్రెల సరఫరా జరగడం లేదు. ఈ క్రమంలోనే అక్కడ పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. దీనిపై జమ్మూకశ్మీర్ మటన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖజీర్ మహమ్మద్ మాట్లాడారు.
Also Read: ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన మోదీ..ఇండియా, అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్ అని కామెంట్
మాంసం కోసం అడ్వాన్సులు ఇచ్చిన వాళ్లు పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. మా అభ్యర్థనను అంగీకరించి ఇప్పటిదాకా సుమారు 210 కుటుంబాలు పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నాయని పేర్కొన్నారు. ఇదిలాఉండగా కశ్మీర్‌లో ఏటా 4 వేల కోట్ల మాంసం వ్యాపారం జరుగుతోంది. ఇందులో పెళ్లిళ్ల కోసం రూ.1500 కోట్ల వరకు ఖర్చవుతాయి. నవంబర్ నుంచి అక్కడ చలిగాలుల తీవ్రత పెరుగుతుంది. అందుకే అక్టోబరు లోపే అక్కడ వివాహాలు ముగుస్తాయి.
Also Read: భారత్ తో సుంకాలపై చర్చలు.. మోదీతో కూడా మాట్లాడతా అంటున్న ట్రంప్..