Minor Boy Rape: ఛీఛీ వెధవలు.. 16 ఏళ్ల బాలుడ్ని రేప్ చేసిన మరో మైనర్, యువకుడు.. వీడియో తీసి..!

UPలోని బిజ్నోర్ జిల్లాలో అవమానకరమైన సంఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలుడిపై ఒక మైనర్ బాలుడు, మరొక యువకుడు బలవంతంగా అత్యాచారం చేశారు. జరిగిన విషయాన్ని ఆ బాదితుడు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Minor Boy Raped by two boys

Minor Boy Raped by two boys

ఇప్పటి వరకు మహిళలపై పురుషులు అత్యాచారాలు చేయడం, పురుషులపై మహిళలు  అత్యారాలు చేయడం వంటి వార్తలు విన్నాం. కానీ ఒక పురుషుడు మరొక పురుషుడిని రేప్(Minor Boy Rape) చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అవును మీరు విన్నది నిజమే. అది కూడా ఒక మైనర్ బాలుడు మరొక మైనర్ బాలుడిని రేప్ చేశాడు. అక్కడితో ఆగకుండా వీడియో కూడా చిత్రీకరించాడు. దీనిబట్టి మానవ సమాజంలో కామ కోరికలు ఎంతలా పెరిగిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఈ అవమానకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read :  దారుణం.. మహిళకు నిప్పంటించిన దుండగుడు.. మంటల్లో కాలుతూనే స్కూటీపై

Minor Boy Raped

యూపీ(UP) లోని బిజ్నోర్ జిల్లా చాంద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. నార్నౌర్ గ్రామానికి చెందిన వీర్ సింగ్ కుమారుడు పింకు, ఒక మైనర్ బాలుడు సెప్టెంబర్ 5న మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో 16 ఏళ్ల ఒక మైనర్ బాలుడిపై బలవంతంగా అత్యాచారం చేశారు. అదే సమయంలో నిందితులలో ఒకరు సంఘటనను తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఫోన్‌ను ఫ్యాన్‌ను పై ఉంచి వీడియో తీశాడు. 

ఈ సంఘటన తర్వాత ఆ మైనర్ బాధితుడు భయం, సిగ్గు కారణంగా కుటుంబ సభ్యులకు ఏం చెప్పలేదు. అలా జరిగిన ఘటనను ఆ మైనర్ తనలో దాచుకుని దాచుకుని చివరికి ఈ నిజాన్ని సెప్టెంబర్ 8న ఏడుస్తూ కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఈ విషయం తెలిసి అతడి తండ్రి వెంటనే చంద్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా.. చంద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు అయింది. 

అనంతరం మైనర్ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడు పింకు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  కుటుంబ సభ్యులతో పాటు స్థానిక గ్రామస్తులు కూడా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటన తమ కొడుకు భవిష్యత్తు, మానసిక స్థితిని ప్రభావితం చేసిందని కుటుంబం అంటోంది. 

అనంతరం బాధితుడి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసి, వైద్య పరీక్షలు పూర్తి చేశామని చాంద్‌పూర్ పోలీసులు తెలిపారు. నిందితులపై బలమైన ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి వీడియోకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరిస్తున్నామన్నారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని అధికారులు చెబుతున్నారు. ఈ వారంలో చాంద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో మైనర్‌పై జరిగిన రెండవ అత్యాచార సంఘటన ఇదే కావడం గమనార్హం.

Also Read :  నంద్యాలలో భార్య గొంతు కోసి చంపిన భర్త

Advertisment
తాజా కథనాలు