India-Putin-Pakistan: అందుకే పుతిన్ మన దగ్గరికి రాడు.. సొంత దేశం పరువు తీస్తున్న పాకిస్తానీలు!

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రాక పాకిస్థానీల్లో నిరాశను నింపింది. పుతిన్ ఎప్పుడూ తమ దేశానికి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు.  ఏముందని మన దగ్గర పుతిన్ రావడానికి అని మరోవైపు పాకిస్తాన్ జర్నలిస్టులే తమ దేశ పరువును తీసుకుంటున్నారు. 

New Update
putin (1)

రష్యా అధ్యక్షుడు పుతిన్(putin) భారత్ పర్యటన పెద్ద సంచలనమే సృష్టించింది. ప్రపంచ దేశాలన్నీ రెండు రోజుల పాటూ ఈ పర్యటన వైపే ఆసక్తిగా చూశాయి. పుతిన్ పర్యటనపై దాయాది దేశం పాకిస్తాన్(pakistan) లో కూడా తీవ్రచర్చకు దారి తీసింది.ఇది అక్కడ ప్రజలను నిరాశకు గురి చేసిందని కూడా చెప్పుకోవాలి. దీంతో రష్యా అధ్యక్షుడు తమ దేశం ఎందుకు రారు అనే ప్రశ్నను లేవనెత్తింది. పశ్చిమ దేశాల ఒత్తిడిని కూడా లెక్క చేయకుండా పుతిన్ బారత్ రావడంపై పాకిస్తాన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. మరోవైపు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ దీనిపై మాట్లాడుతూ రష్యా దగ్గరకు వెళ్ళడం తమ స్నేహితులైన అమెరికాకు ఇష్టం లేదనే అర్ధం వచ్చేట్టుగా మాట్లాడారు. వారి దగ్గరకు వెళ్ళి అడుక్కోవడం అని పదజాలాన్ని కూడా ఉపయోగించారు. 

Also Read :  రష్యాతో భారత్ స్ట్రాంగ్ బంధం.. అసలెప్పుడు మొదలైందీ స్నేహం?

ఏముందని వస్తారు అంటూ ఎగతాళి..

మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ పాకిస్తాన్ కు రాపోవడంపై ఆ దేశ జర్నలిస్టులు మరో రకంగా స్పందిస్తున్నారు. పాకిస్తాన్ లో ఏముందని పుతిన్ ఇక్కడకు వస్తారని అంటున్నారు. తన జేబులు ఖాళీ చేసుకోవడానికి ఎందుకు వస్తారని తమ దేశ పరిస్థితిని ఎగతాళి చేశారు. పాకిస్తాన్ రక్షణ విశ్లేషకుడు ఖమర్ చీమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ కజ్మీ ఈ వ్యాఖ్యలను చేశారు.  పాకిస్తాన్ లో ఏం వ్యాపారం ఉందని వారిని ఇక్కడకు పిలుస్తాము. ఒకవేళ వారు వచ్చినా ఏం చెబుతాం అంటూ కజ్మీ ప్రశ్నించారు. మాకు యుద్ధ విమానాలు ఇవ్వండి, ఇంధనం ఇవ్వండి అని అడుగుతాం.   దానికి బదులుగా మనమేం ఇవ్వగలము. భారత్ అంటే డబ్బులు ఇస్తుంది. భారతదేశం ఏది తీసుకున్నా, మనం కూడా దానిని తీసుకుంటాము..కానీ అదంతా కేవలం ప్రదర్శన కోసం అంటూ కజ్మీ వ్యంగ్యంగా మాట్లాడారు. అందుకే పుతిన్ లాంటి వారు మన దేశానికి రారు అని అన్నారు.  అంతే కాదు ఆమె షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని మరింత ఎగతాళి చేస్తూ కూడా మాట్లాడారు. పాకిస్తాన్ ఎప్పుడూ పేదరికం, వరదలు, భూకంపాలను చూపిస్తుంది. అప్పుడు ఊబిలో కూరుకుపోయిన మన దేశానికి ఎవరు మాత్రం తమ జేబులు ఖాళీ చేసుకోవడానికి వస్తారు అంటూ జర్నలిస్ట్ కజ్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని బాగుచేయడానికి మన ప్రభుత్వం ఏం చేసిందంటూ ఆమె ప్రశ్నించారు. అప్పులతో నడిపిస్తోందని దుయ్యబట్టారు. 

Also Read :  రూపాయి విలువ ఎందుకు పతమనయ్యింది .. ప్రధాన కారణాలు ఇవే !

అక్కసు వెళ్ళగక్కిన పాకిస్తాన్..

మరోవైపు భారత్ పై తన అక్కసను వెళ్ళగక్కడానికి పాకిస్తాన్ అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనాకు మద్దుతు పలికింది. అరుణాచల్ ప్రదేశ్ గురించి చైనా ప్రకటనను మేము గమనించాము. పాకిస్తాన్ తన సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతకు సంబంధించిన విషయాలలో చైనాకు మద్దతు ఇస్తూనే ఉంటుంది" అని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల, చైనా అరుణాచల్ ప్రదేశ్ నుండి ఒక మహిళను ఏకపక్షంగా నిర్బంధించడంతో తీవ్ర కలకలం రేగింది. ఆ మహిళ పాస్‌పోర్ట్ చెల్లదని చైనా ప్రకటించింది. ఈ విషయమై పాకిస్తాన్ చైనాకు మద్దతు పలికింది. 

Advertisment
తాజా కథనాలు