India-Russia: రష్యాతో భారత్ స్ట్రాంగ్ బంధం..అసలెప్పుడు మొదలైందీ స్నేహం?

భారత్ సైన్యంలో దాదాపు 60 శాతం అంతకంటే ఎక్కువ ఆయుధాలు రష్యన్ కు చెందినవే అని తెలుస్తోంది. మొదటి నుంచీ ఇండియా మిగా అన్ని దేశాల కంటే రష్యాతోనే ఎక్కువ స్నేహంగా ఉంటోంది. అసలెప్పుడు మొదలైందీ ఫ్రెండ్షిప్...పూర్తి వివరాలు కింది ఆర్టికల్ లో...

New Update
ind-russia

 భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. ఆ సమయంలో ఇండియా దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవు.  కొన్ని పాత అరిగిపోయిన ఆయుధాలు మాత్రమే ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన వెంటనే బలమైన సైన్యాన్ని నిర్మించుకోవాల్సి అవసరం వచ్చింది. అప్పుడు ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలేవీ ఇండియాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఆయుధాలను విక్రయించడానికి ఇష్టపడలేదు.  దానికి భారత్ అనుసరించిన అలీన విధానం. అమెరికా లాంటి దేశాలు స్నేహం ప్రకటించినప్పటికీ..ఆయుధాల విక్రయానికి మాత్రం ముందుకు రాలేదు. అలాంటి సమయంలో భారత్ పై దృష్టి పెట్టిన ఒకే ఒక్క దేశం రష్యా. 

1960లలో మొదలైన స్నేహం..

అప్పటి కోల్డ్ వార్ లో ప్రపంచం రెండు శిబిరాలుగా విడిపోయింది. అలాంటి టైమ్ లో భారత్ మద్దతును రష్యా గుర్తించింది. తనకు ఎంత ముఖ్యమో గమనించింది. అది దృష్టిలో పెట్టుకునే రష్యా..భారత్ తో స్నేహం మొదలుపెట్టింది. అప్పుడు మొదలైన ఫ్రెండ్‌షిప్ కాలాన్ని తట్టుకుని నిలబడడమే కాక లోతైన నమ్మకాన్ని, సంఘీభావం, స్వేచ్ఛ, ఒకరి పట్ల మరొకరికి గౌరవాన్ని పెంపొందించుకుంది. 1962 తర్వాత భారత్ కు సోవియట్ యూనియన్ స్నేహ హస్తాన్ని చాచింది. ఆసియాలో తమ పట్టును పెంచుకునేందుకు దోహదపడింది. మొట్టమొదటగా 1960ల ప్రారంభంలో సోవియట్ యూనియన్ భారత్ కు మిగ్ 21 యుద్ధ విమానాలను అందించింది.  ఇవే అప్పట్లో అత్యంత అధునాతన ఫైటర్ జెట్ లు. ఇది అప్పట్లో ఒక గేమ్ ఛేంజర్ గా నిరూపించబడింది. దీంతో పాటూ రష్యా తన యుద్ధ సాంకేతికతను కూడా బదిలీ చేసింది. ఇది భారత్ స్వావలంబన దిశగా అడుగులు వేసేందుకు దోహదపడింది. ఇలా ప్రతీసారి రష్యా, భారత కు అండగా నిలబడింది. అలాగే ఇండియా కడా సోవియట్ యూనియన్ స్నేహాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చింది. 

1971లో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకవైపు బంగ్లాదేశ్ స్వతంత్ర యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో, అమెరికా దాని మిత్రదేశాలు పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి. వాటి  నౌకాదళం భారతదేశాన్ని బెదిరించడానికి బంగాళాఖాతం వైపు కదులుతోంది.ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆ సమయంలో రష్యా భారత్ కు అండగా నిలబడింది. భారీ రాజకీయ రిస్క్ తీసుకుని మరీ తన యుద్ధ నౌకలను భారత సరిహద్దుల్లో మోహరించింది. దీంతో అమెరికా నౌకాదళం వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఈ సంఘటన భారత ప్రజల హృదయాల్లో సోవియట్ యూనియన్ పట్ల అచంచలమైన నమ్మకం, గౌరవాన్ని నింపింది. అవసరం వచ్చినప్పుడు భారతదేశంతో ఏ దేశం బేషరతుగా నిలబడిందో ప్రపంచం చూసింది. ఈ సంఘటన కేవలం సైనిక దళాల గురించి మాత్రమే కాదు..ఇరు దేశాల లోతైన స్నేహాన్ని కూడా తెలియజేస్తుంది. 

రష్యాగా అవతరించిన తర్వాత కూడా..

1991లో, సోవియట్ యూనియన్ కూలిపోయి, రష్యా అనే కొత్త దేశం ఆవిర్భవించింది. దీని తర్వాత భారత్ తో సోవియట్ యూనియన్ స్నేహం ఆగిపోతుంది అనుకున్నారు అంతా. కానీ రష్యా ఈ స్నేహ వారసత్వాన్ని నిలబెట్టుకుంది. తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. అప్పటి నుంచి యుద్ధ విమానాల విడిభాగాలను సరఫరా చేస్తూనే ఉంది. దాన్ని ఇప్పటి వరకు కొనసాగిస్తోంది కూడా. రష్యా ఇప్పుడు మరింత అధునాతన ఆయుధాలను అందించడానికి అంగీకరించింది. భారత సైన్యంలోని T-72 ట్యాంకుల నుండి సుఖోయ్ ఫైటర్ జెట్ల వరకు ప్రతిదీ సోవియట్ మూలానికి చెందినదే కావడం గమనార్హం. 

భారత దగ్గర ఉ్నవన్నీ రష్యా ఆయుధాలే..

1980లో భారతదేశం రష్యా నుండి పెద్ద మొత్తంలో MiG-29 యుద్ధ విమానాలు, T-72 ట్యాంకులను కొనుగోలు చేసింది. 1990లో రెండు దేశాలు సంయుక్తంగా బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి కార్యక్రమానికి పునాది వేశాయి. ఈ క్షిపణి ఇప్పుడు రెండు దేశాల వ్యూహాత్మక బలానికి చిహ్నంగా ఉంది. 2004 లో భారతదేశం రష్యా నుండి అడ్మిరల్ గోర్ష్కోవ్ నౌకను కొనుగోలు చేసింది. దీనిని కొత్త విమాన వాహక నౌకగా పునర్నిర్మించి INS విక్రమాదిత్య అని పేరు పెట్టారు. ఇక 2010 తర్వాత రష్యా భారతదేశానికి అత్యంత అధునాతనమైన T-90 భీష్మ ట్యాంకులను కూడా విక్రయించింది. ఇవి నేడు భారత సైన్యానికి వెన్నెముకగా ఉన్నాయి. దీని తరువాత ఇరు దేశాల మధ్యనా జరిగిన అతి పెద్ద ఒప్పందం S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ. S-400 నేడు భారతదేశంలో అత్యంత బలమైన వైమానిక రక్షణ కవచం, ఇది 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాలను నాశనం చేయగలదు. అలాగే రష్యా..భారత్ కు అణు జలాంతర్గాములను కూడా లీజుకు ఇచ్చింది. రష్యా ఎప్పుడూ భారతదేశంతో అత్యంత సున్నితమైన, అధునాతన సాంకేతికతను కూడా పంచుకోవడానికి సంసిద్ధతను ప్రదర్శిస్తూనే వచ్చింది. 

రష్యా పట్ల భారత్ కూడా..

ఇక ఇండియా కూడా రష్యా పట్ల తన స్నేహాన్ని అలాగే నిలుపుకుంటూ వచ్చింది. ఫిబ్రవరి 2022లో రష్యా..ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో రష్యాపై అమెరికా, యూరోపియన్ దేశాలు తీవ్రమైన ఆంక్షలు విధించాయి. ఆ దేశం దగ్గర చమురు కొనడం ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ వంటి దేశాల మీద ఒత్ిడి తీసుకువచ్చారు. ఇండియాపై 25 శాతం అదనపు సుంకాలతో విరుచుకుపడ్డారు కూడా. అయినా కూడా భారత్ ఎక్కడా తగ్గలేదు. రష్యా దగ్గర చమురు కొనడం ఆపలేదు. మునుపటి కంటే చాలా రెట్లు ఎక్కువ ముడి చమురును కొనుగోలు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో.. భారతదేశం మొత్తం ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 2 శాతం మాత్రమే ఉండగా..2024కు దాని విలువ $52.73 బిలియన్లకు చేరుకుంది. భారతదేశం రాత్రికి రాత్రే రష్యాలో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా అవతరించింది. 2025 అక్టోబర్‌లో అయితే దిగుమతులు రోజుకు 1.48 మిలియన్ బ్యారెళ్లకు (bpd) చేరుకున్నాయి.

మోదీ, పుతిన్ మధ్య గాఢ స్నేహం..

భారత్, రష్యాల మధ్య స్నేహం నేటికీ బలంగా ఉంది. ప్రధాని మోదీ ప్రభుత్వం వచ్చాక ఇది మరిం బలపడిందనే చెప్పాలి. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచీ పుతిన్ తో మంి సంబంధాలను కలిగి ఉన్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ మొదటిసారి రష్యా వెళ్ళారు ఆ సమయంలోనే పుతిన్ ఆయనకు అత్యంత గౌరవాన్ని ఇవ్వడమే కాకుండా ప్రత్యేకంగా కూడా చూసుకున్నారు. ఇరు దేశాధినేతలూ ఇప్పటికీ తమ మధ్య ఉన్న అనుబంధాన్ని అదే విధంగా మెయింటెయిన్ చేయడం గమనార్హం. వారిద్దరి మధ్యా బలమైన స్నేహానికి నిదర్శనమే...పుతిన్ టూర్ లో తన హై సెక్యూర్డ్ కారును వదిలి ప్రధాని మోదీతో అతి మామూలు కారులో వెళ్ళడం. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వార్షిక రక్షణ వాణిజ్యం $2-3 బిలియన్లు (సుమారు రూ. 16,000-24,000 కోట్లు) గా ఉంది.  భారతదేశం  మొత్తం ఆయుధ దిగుమతుల్లో గణనీయమైన భాగం దీనిదే. నేడు, భారత సైన్యం తాలూకా ఆస్తులలో గణనీయమైన భాగం రష్యా నుండి వస్తున్నవే. వాటిలో సుఖోయ్-30MKI ఫైటర్ జెట్‌లు, MiG-29లు, T-90 ట్యాంకులు, INS విక్రమాదిత్య,  S-400 క్షిపణులు ఉన్నాయి. ఈ వాటా నేటికీ 60-70 శాతం గా ఉంది. 

Advertisment
తాజా కథనాలు