/rtv/media/media_files/2025/12/15/govt-set-to-bring-in-bill-replacing-mgnrega-with-new-law-guaranteeing-125-days-of-wage-employment-2025-12-15-15-47-21.jpg)
Govt set to bring in Bill replacing MGNREGA with new law guaranteeing 125 days of wage employment
మహాత్మగాంధీ(mahatma-gandhi) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)(mgnrega-wage) గురించి అందరికీ తెలియాల్సిందే. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం(congress-government) దీన్ని తీసుకురాగా అప్పటినుంచి ఈ పథకం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ పథకం పేరు మారుస్తూ కొత్త బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం.. మహాత్మగాంధీ ఉపాధి హామీ స్కీమ్ స్థానంలో కొత్త బిల్లును తీసుకురానుంది.
Also Read : హెడ్‌మాస్టర్ తిట్టాడని.. క్లాస్‌కు రివాల్వర్ తీసుకొచ్చి బెదిరించిన విద్యార్థి
Govt Set To Bring In Bill Replacing MGNREGA With New Law
''వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్'' (VB G RAM G) అనే పేరుతో కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యింది. ఈ బిల్లుకు సంబంధించిన ప్రతులను లోక్‌సభ సభ్యులకు అందించినట్లు తెలుస్తోంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే కేంద్రం ఈ కొత్త బిల్లును తీసుకొస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మహాత్మగాంధీ ఉపాధి పథకం (MGNREGA) కింద గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల పాటు పని ఉంటుంది. చెట్లు నాటడం, కాల్వలు,చెరువులను తవ్వడం, ఇంకుడు గుంతలు తీయడం లాంటి అనేక పనులు 100 రోజుల పాటు జరుగుతాయి. ఈ స్కీమ్ కింద పనిచేసిన గ్రామీణ ప్రజలకు రోజువారి వేతనం లభిస్తుంది. గత 20 ఏళ్లుగా ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లులో ఉపాధి పనిని 100 నుంచి 125 రోజులకు పెంచేలా ప్రతిపాదించారు. అంతేకాదు ఇందులో పనిచేసిన వారికి వారం లేదా 15 రోజుల్లోనే వేతనాలు చెల్లించేలా సవరణలు చేశారు. ఒకవేళ చెల్లింపులు సకాలంలో జరగకపోతే నిరుద్యోగ భత్యం ఇచ్చే నిబంధన కూడా ఉంది.
Also Read : కమ్యూనిస్టుల కంచు కోట బద్దలు.. కేరళ లోకల్ ఎలక్షన్స్ లో దుమ్ములేపిన BJP
కేంద్రం తీసుకొస్తున్న ఈ కొత్త బిల్లులో మార్పులు రానున్నాయి. ఈ స్కీమ్‌ను నాలుగు కెటగిరీలుగా విభజించారు. ఇందులో నీటి భద్రత, గ్రామీణ మౌలికసదుపాయాలు, జీవనోపాధి మౌలిక సదుపాలు, విపత్తు స్థితిస్థాపకత ఉన్నాయి. ఈ పనివిధానంలో పారదర్శకత ఉండేలా బయోమెట్రిక్ కూడా తీసుకురానున్నారు. అంతేకాదు ఈ స్కీమ్ కింద పని చేసే గ్రామస్థులు తమ సమస్యలపై ఫిర్యాదులు చేసేలా, అధికారులు దాన్ని పరిష్కరించేలా ఓ నిబంధన కూడా ఉంది.
MGNREGA స్కీమ్‌లో లేబర్ వర్కర్లకు కేంద్రమే 100 శాతం వేతనం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వర్కర్లను నియమించుకోవడం, కావాల్సిన సామాగ్రి అందిచడం కోసం కొంత ఖర్చు చేస్తాయి. అయితే కేంద్రం తీసుకొస్తున్న G Ram G స్కీమ్‌లో కేంద్రం 60 శాతం ఖర్చు చేస్తే రాష్ట్రాలు 40 శాతం ఖర్చు చేస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్రాలు ఖర్చు చేయాలి. ఇక కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్రమే 100 శాతం నిధులు అందిస్తుంది. కేంద్రం తీసుకురానున్న ఈ కొత్త స్కీమ్‌పై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఈ పథకానికి మహాత్మ గాంధీ పేరును మార్చడంపై ఆ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Follow Us