/rtv/media/media_files/2025/12/15/fotojet-13-2025-12-15-10-11-57.jpg)
Social Media Screening
Social Media Screening: హెచ్ 1బీ(h1b visa 2025), హెచ్4 వీసాలకు సంబంధించిన పూర్తిస్థాయి స్క్రీనింగ్, పరిశీలన ఈరోజు నుంచే ప్రారంభం కానున్నది. ఇందులో భాగంగా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను కూడా అమెరికా పరిశీలించడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని ది స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అమెరికా మీడియాకు తెలియజేసింది. అయితే కేవలం హెచ్1 బీ వీసా దరఖాస్తుదారుల ఖాతాలను మాత్రమే కాకుండా.. హెచ్ 4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించనున్నట్లు ప్రకటించింది. దీనికి అనుగుణంగా వీసా దరఖాస్తుదారులు తమ ఖాతాను ప్రైవేటు నుంచి పబ్లిక్‌కు మార్చుకోవాలని సూచించింది. కాగా, ఇండియాకు చెందిన హెచ్ 1 బీ వీసా దరఖాస్తుదారులు ఇప్పటికే ఇండియాలో ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్నారు.
కాగా, అమెరికా ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ గైడ్ లైన్స్ మూలంగా ఇండియన్ దరఖాస్తుదారులు మరోసారి ఇంటర్వ్యూకు అటెండ్ కావలసి ఉంటుంది. ఈ విషయమై ది స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘అమెరికా వీసా గౌరవం మాత్రమే .. అది హక్కు కాదు. వీసా పొందడానికి ఎవరు అర్హులో ఎవరు కాదో తెలుసుకోవటానికి అవసరమైన ఉన్న అన్ని రకాల సమాచారాన్ని స్కీనింగ్, పరిశీలన చేస్తాం. దేశ భద్రతకు, ప్రజారక్షణకు ఆటంకంగా మారే వారిని అమెరికాలో అడుగుపెట్టనీయం’ అని ఖరాఖండిగా తెలిపారు.
ఇదిలా ఉండగా భారత్, చైనా తదితర దేశాల నుంచి అమెరికా వచ్చి ఇక్కడి అత్యుత్తమ కాలేజీల్లో చదువుకున్న ప్రతిభావంతులైన విద్యార్థులను తిరిగి వారి దేశాలకు వెళ్లనివ్వటం సిగ్గుచేటని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అలాంటి వారిలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు అమెరికన్ కంపెనీలు ఉద్యోగాలిచ్చి అమెరికాకే సేవలందించేలా చర్యలు తీసుకోవాలని అమెరికాలోని టాప్ కంపెనీల సీఈఓలకు ఆయన సూచించారు. ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను అమెరికాలోనే ఉంచుకునేందుకు కంపెనీలు వారి కోసం గోల్డ్ కార్డులను కొనుగోలు చేయాలని ట్రంప్ సూచించారు. గోల్డ్ కార్డు కొన్నవాళ్లకు ఐదేళ్లలోనే అమెరికా పౌరసత్వం వస్తుందని కూడా ఆయన తెలిపారు.
Also Read : ఆస్ట్రేలియాలో పహల్గాం తరహా ఉగ్రదాడి.. 11 మంది మృతి
హెచ్1బీ వీసాలు తాత్కాలిక రద్దు
కాగా గత కొంతకాలంగా విదేశీ ఉద్యోగులు, విద్యార్థులకు వీసాల జారీలో అమెరికా ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తుంది. అంతేకాదు ఆ దేశంలోని విదేశీ ఉద్యోగులపై కూడా చర్యలకు ఉపక్రమించింది. అమెరికాలో హెచ్1బీ, హెచ్4 వీసాలతో పనిచే స్తున్న కొందరు ఉద్యోగులకు.. వారి వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వారికి ఇప్పటికే ఈమెయిల్స్ పంపింది. అయితే, ప్రస్తుతం వారి వీసాలు తాత్కాలికంగా రద్దయినా ఆ ఉద్యోగులు తమ వీసాల గడువు సహజంగా ముగిసేవరకు అమెరికాలో చట్టబద్ధంగా నివసించడానికి అవకాశం ఉంది. ఇది శాశ్వత వీసా తిరస్కరణ కాదని హ్యూస్టన్‌కు చెందిన ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమన్ తెలిపారు. హెచ్1బీ, హెచ్4 వీసాదారుల సోషల్ మీడియా కార్యకలాపాలను క్షణ్ణంగా తనిఖీ చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోందని, అందుకోసమే వీసాల తాత్కాలిక రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇప్పటికే విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను కూడా అమెరికా(america) అధికారులు వాయిదా వేయడం గమనార్హం. దరఖాస్తుదారులతోపాటు వారి కుటుంబసభ్యులకు చెందిన గత ఐదేళ్ల సోషల్ మీడియా యాక్టివిటీ వివరాలు ఇవ్వాలని కోరారు. ఇప్పుడు వీసాలు ఉన్నవారిని కూడా అలాగే అడగబోతున్నారని న్యూమన్ తెలిపారు. వీసాలు తాత్కాలికంగా రద్దయిన వారు అమెరికాలో ఉన్నంతకాలం సమస్య లేదని, దేశం బయటకు వెళ్లి, తిరిగి రావాలంటే మాత్రం సాధ్యం కాదని రెడ్డి న్యూమన్ బ్రౌన్ పీసీ అనే ఇమిగ్రేషన్ న్యాయ సంస్థ తెలిపింది. కాగా, ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంతో అత్యధికంగా ప్రభావితం అయ్యేది భారతీయులేననే తెలుస్తోంది. హెచ్1బీ, హెచ్4 వీసాదారుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉండటమే దీనికి కారణం. వీసాల తాత్కాలిక రద్దు వల్ల వారు ఏదైనా ముఖ్యమైన పని ఉన్నా స్వదే శానికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ వస్తే.. తిరిగి అమెరికా వెళ్లటం కష్టం. తిరిగి వెళ్లాలంటే సుదీర్ఘకాలం వేచి ఉండటంతోపాటు మళ్లీ కొత్త వీసా పొందినంత పని అవుతుందని విదేశీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. - Donald Trump On H1B Visa
Also Read : ఢిల్లీని ఆక్రమిస్తాం.. పాక్ ఉగ్రవాది సంచలన వ్యాఖ్యలు
Follow Us