/rtv/media/media_files/2025/05/27/ZYXE9eKz4aGVaheGREu2.jpg)
Ramming Car In Liverpool Parde
ఆనందం అంబరాన్నంటుతున్న వేళ ఒక్కసారిగా అక్కడ హాహాకారాలు చెలరేగాయి. ఏమవుతుందో తెలుసుకునే లోపు కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంగ్లాండ్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఫుట్ బాల్ ప్రీమియర్ లీగ్ లో 20వ టైటిల్ ను లివర్ పూల్ క్లబ్ సొంతం చేసుకుని.. మాంచెస్టర్ యునైటెడ్ జట్టుతో సమంగా నిలిచింది. దీంతో లివర్ పూల్ జట్టు బారీ ఎత్తున సంబరాలు చేసుకుంది. దీనికి పెద్ద సంఖ్యలో జనం కూడా వచ్చారు.
Also Read : ఛీ ఏం మనిషివిరా.. 16 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల వ్యక్తి!
కార్ తో జనం మీదకు..
వారందరికీ అభివాదం చేస్తూ లివర్ పూల్ జట్టు పరేడ్ నిర్వహిస్తోంది. అదిగో అప్పుడు ఓ దుండుగుడు కార్ తో జనాల మీదకు వచ్చాడు. అడ్డదిడ్డంగా అందరినీ గుద్దుకుంటూ వెళ్ళాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపు కొంతమందిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో మొత్వాతం 27 మందికి గాయాలయ్యాయి. దీనివెంటనే వానదారుడిని అరెస్ట్ చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇది ఉగ్రవాదులకు సంబంధించనది కాదని చెప్పారు. అయితే కారుతో దూసుకొచ్చిన ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read : పహల్గాంలో కేబినెట్ భేటీ..అజెండా ఇదే..
Car drives into Liverpool fan crowd. pic.twitter.com/Q4422ueYIo
— RedandWhite Ireland (@RIreland29776) May 26, 2025
Also Read: Maoists: కాల్పులు వద్దు లొంగిపోతాం అంటున్న మావోయిస్టులు
Also Read : భారత్ అమ్ముల పొదిలో మరో సూపర్ మిస్సైల్.. పరీక్షించనున్న డీఆర్డీవో
parade | england | today-latest-news-in-telugu | latest-telugu-news | today-news-in-telugu | telugu-news | international news in telugu | Foodball Premier League