/rtv/media/media_files/2025/02/21/KZCOb3nWUPiZ6DmkyOgk.jpg)
marriage
ప్రస్తుతం రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకునేటప్పుడు కనీసం వయస్సు కూడా చూడటం లేదు. ఇలాంటి ఘటన తాజాగా అనంతపురంలో జరిగింది. ఓ 60 ఏళ్ల వ్యక్తి బలవంతంగా 16 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్న ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో 60 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి 16 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు.
ఇది కూడా చూడండి: Vijay Devarakonda : అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
భార్య చనిపోవడంతో రెండో పెళ్లి..
కూలి పనులు చేసుకునే ఓ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే వీరిలో పెద్ద కుమార్తెకు వివాహం జరగ్గా భర్త చనిపోయాడు. దీంతో పెద్ద కుమార్తె పుట్టింట్లోనే ఉంది. ఇక రెండో కుమార్తెను ఓ 60 ఏళ్ల వ్యక్తి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. రామాంజనేయులు అనే వ్యక్తికి రెండేళ్ల కిందట భార్య చనిపోయింది. ఇతనికి ఒక కుమారుడు, కూతురు కూడా ఉన్నారు.
ఇది కూడా చూడండి: iQOO Neo 10: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!
అయినా కూడా ఈ వయస్సులో పెళ్లి చేసుకోవాలని బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను అడిగాడు. దీనికి వారు ఒప్పుకోకపోతే బెదిరించి మరి వారి ఎదురుగా బలవంతంగా తాళి కట్టాడు. ఆమెను బలవంతంగా కాపురానికి తీసుకెళ్లాడు. అయితే ఇష్టం లేని ఆ బాలిక తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం జరగాలని కోరుకుంది.
ఇది కూడా చూడండి: Lalu Prasad Yadav: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!