Jananayagan: ‘జన నాయగన్‌’ ఈవెంట్‌ రికార్డు..

తమిళ స్టార్‌, టీవీకే అధినేత విజయ్‌ హీరోగా నటిస్తున్న‘జన నాయగన్‌’ ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ రికార్డు సృష్టించింది. మలేసియాలో జరిగిన ఈ ఈవెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా 85వేలకు పైనే ఫ్యాన్స్‌,సెలబ్రిటీలు తరలిరావడంతో మలేసియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించుకుంది.

New Update
FotoJet (50)

vijay jananayogan

Jananayagan : తమిళ స్టార్‌, టీవీకే అధినేత విజయ్‌ హీరోగా నటిస్తున్న ‘జన నాయగన్‌’(Vijay Jananayagan) ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ రికార్డు సృష్టించింది. మలేసియా(malaysia) లో డిసెంబర్‌ 27న జరిగిన ఈ ఈవెంట్‌కు భారీ స్థాయిలో అభిమానులు తరలివచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 85 వేలకు పైనే ఫ్యాన్స్‌, సెలబ్రిటీలు తరలిరావడంతో మలేసియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించుకుంది. జనవరి 9న ఈచిత్రం విడుదల కానుంది. 

Thalapathy Vijay  Jana Nayagan Audio Launch Photos_ (2)

Also Read :  ఫిల్మ్‌ఛాంబర్‌ అధ్యక్షుడిగా సురేశ్‌బాబు

Jananayagan Event Record

 ‘జన నాయగన్‌’ విజయ్‌ హీరోగా రానున్న చివరి చిత్రంగా ప్రకటించడంతో మలేసియాలో ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించింది టీమ్‌ ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరయ్యారు. దీంతో మలేసియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో ఈ చిత్రానికి  స్థానం దక్కింది. కాగా హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఆడియో లాంచ్‌ మలేషియాలో నిర్వహించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఆడియో లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. వేలాదిమంది అభిమానుల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ ‘దళపతి కచేరి’ పాటకు డ్యాన్స్ చేసి ఫ్యాన్స్‌ను అలరించారు. కాగా ఈవెంట్‌కు  హీరోయిన్ పూజా హెగ్డే  చీరలో కొత్తగా కనిపిస్తూ అందాలతో అలరించేలా ముస్తాబయింది.

Thalapathy Vijay  Jana Nayagan Audio Launch Photos_ (3)

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాట మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఆయనకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇమేజ్ పరంగా అభిమానుల్లో ఆయన స్థానం ఎక్కడా తగ్గలేదు. అలాంటి విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం సినీ వర్గాల్లోనే కాదు, అభిమానుల్లోనూ పెద్ద చర్చకు దారి తీసింది.

ఇప్పటికే TVK పేరుతో తన రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్, ప్రజా సమావేశాలు, రాజకీయ కార్యకలాపాలతో యాక్టివ్‌గా ఉన్నారు. వచ్చే మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లోనే కొనసాగి ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘జననాయగన్’ సినిమా విజయ్ కెరీర్‌లో చివరి చిత్రంగా నిలవనుంది.

Thalapathy Vijay  Jana Nayagan Audio Launch Photos_ (6)

Also Read :  రజనీకాంత్ ‘జైలర్ 2’లో బాలీవుడ్ బడా హీరో..?

Thalapathy Vijay  Jana Nayagan Audio Launch Photos_ (5)

Thalapathy Vijay  Jana Nayagan Audio Launch Photos_ (13)

Pooja-Hegde

Thalapathy Vijay  Jana Nayagan Audio Launch Photos_ (14)

Thalapathy Vijay  Jana Nayagan Audio Launch Photos_ (15)

Thalapathy Vijay  Jana Nayagan Audio Launch Photos_ (17)

Thalapathy Vijay  Jana Nayagan Audio Launch Photos_ (19)

Thalapathy Vijay  Jana Nayagan Audio Launch Photos_ (16)

Thalapathy Vijay  Jana Nayagan Audio Launch Photos_ (18)

Advertisment
తాజా కథనాలు