Jailer 2 Update: రజనీకాంత్ ‘జైలర్ 2’లో బాలీవుడ్ బడా హీరో..?

రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ చిన్న పాత్రలో కనిపించవచ్చని మిథున్ చక్రవర్తి తెలిపారు. అయితే అధికారిక ప్రకటన లేదు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం వేసవి తర్వాత విడుదల కానుంది.

New Update
Jailer 2 Update

Jailer 2 Update

Jailer 2 Update: సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా సినిమా ‘జైలర్ 2’ ఇప్పటికే భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా , ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి వెల్లడించారు. ఆయన కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. బెంగాల్‌కు చెందిన ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ మిథున్ సినిమా నటీనటుల గురించి మాట్లాడారు.

ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో మోహన్‌లాల్, షారుఖ్ ఖాన్, రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్ వంటి పెద్ద స్టార్లు ఉన్నారని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో షారుఖ్ ఖాన్ ‘జైలర్ 2’లో భాగమయ్యారనే వార్తలకు బలం చేకూరింది. అయితే ఇప్పటివరకు చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. షారుఖ్ పాత్ర ఎలా ఉండబోతుందనే విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది.

ఇంతకు ముందు షారుఖ్ ఖాన్ ‘రా.వన్’ సినిమాలో రజనీకాంత్‌ చిన్న సీన్‌లో కనిపించారు. అలాగే ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాలో ఒక పాటలో రజనీకాంత్ పేరు ప్రస్తావన రావడం అభిమానులకు బాగా నచ్చింది. ఇద్దరి మధ్య మంచి స్నేహం, గౌరవం ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇద్దరూ ఒక సౌత్ సినిమా కోసం కలిసి పనిచేస్తే అది అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ అవుతుందనే చెప్పాలి.

ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్నారని వినాయకన్, సూరజ్ వెంజారమూడు, సంతానం ధృవీకరించారు. అలాగే నటి మేఘనా రాజ్ సర్జా కూడా తాను ఈ సినిమాలో భాగమని వెల్లడించారు. నటీనటుల జాబితా రోజురోజుకూ పెరుగుతుండటంతో సినిమా మీద ఆసక్తి మరింత పెరుగుతోంది.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. ‘జైలర్ 2’ సినిమా వేసవి తర్వాత థియేటర్లలో విడుదల కానుంది. అధికారిక ప్రకటనలు వస్తే, ఈ సినిమా మరింత హాట్ టాపిక్‌గా మారడం ఖాయం.

Advertisment
తాజా కథనాలు