/rtv/media/media_files/2025/12/28/suresh-babu-2025-12-28-19-44-59.jpg)
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు(Producer Suresh Babu) ఘనవిజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ‘ప్రోగ్రెసివ్ ప్యానల్’ మద్దతుతో బరిలోకి దిగిన ఆయన తన ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యతను కనబరిచారు. - Suresh Babu Comments
Producer #SureshBabuDaggubati has been elected as the new President of the Telugu Film Chamber of Commerce!!@SBDaggubatipic.twitter.com/0J9y3hW6Qe
— CineCorn.Com (@cinecorndotcom) December 28, 2025
ఈ ఎన్నికల్లో సురేశ్‌బాబు బృందం క్లీన్ స్వీప్ చేసింది. కార్యదర్శిగా అశోక్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ, కోశాధికారిగా దామోదరప్రసాద్ ఎన్నికై ప్యానల్ బలాన్ని చాటారు. మొత్తం 48 స్థానాలకు జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో ‘ప్రోగ్రెసివ్ ప్యానల్’ ఏకంగా 31 స్థానాలను కైవసం చేసుకోగా, ప్రత్యర్థి ‘మన ప్యానెల్’ 17 స్థానాలకే పరిమితమైంది. పరిశ్రమలోని ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, డిస్టిబూటర్ల సంక్షేమం కోసం తమ ప్యానల్ కట్టుబడి ఉంటుందని విజయం అనంతరం సురేశ్‌బాబు ఆకాంక్షించారు. ఈ విజయంతో రాబోయే రెండేళ్ల పాటు తెలుగు సినీ పరిశ్రమ నిర్ణయాల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. పరిశ్రమలోని సమస్యల పరిష్కారం, థియేటర్ల వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై కొత్త కార్యవర్గం దృష్టి సారించనుంది.
Also Read : 'రాజాసాబ్' క్లైమాక్స్ పై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్..
సెక్టార్ల వారీగా ఫలితాలు:
ఎగ్జిబిటర్స్ సెక్టార్: ఈ విభాగంలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఏకపక్ష విజయం సాధించింది. మొత్తం గెలిచిన వారిలో 14 మంది ప్రోగ్రెసివ్ వారే కాగా, మన ప్యానెల్ కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.
డిస్ట్రిబ్యూషన్ సెక్టార్: 12 ఈసీ స్థానాలకు గానూ ప్రోగ్రెసివ్ ప్యానెల్ 8 స్థానాలు సాధించగా, మన ప్యానెల్ 3 చోట్ల గెలిచింది (ఒక స్థానంలో టై అయింది).
ప్రొడ్యూసర్స్ సెక్టార్: ఇక్కడ మాత్రం మన ప్యానెల్ గట్టి పోటీనిచ్చి 7 స్థానాలు గెలుచుకోగా, ప్రోగ్రెసివ్ ప్యానెల్ 5 స్థానాలను పొందింది.
స్టూడియో సెక్టార్: మన ప్యానెల్ ముగ్గురు సభ్యులతో ఆధిక్యం ప్రదర్శించగా, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఒకరు గెలిచారు.
Also Read : 'రాజా సాబ్' గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మరో ఇంట్రెస్టింగ్ సర్‌ప్రైజ్ రెడీ..?
Follow Us