Manipur: మణిపూర్ లో మరోసారి టెన్షన్స్..ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్

మణిపూర్ లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కుకీ, మైటీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అరంబై టెంగోల్ సభ్యుడిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మైటీలు ఆందోళనలకు దిగారు. ఇంఫాల్‌లోని క్వాకీథెల్ ప్రాంతంలో కాల్పుల శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు.

New Update
imphal

Manipur Voilence

మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో మళ్ళీ గొడవలు చెలరేగాయి. అరంబై టెంగోల్ సభ్యుడిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మైటీలు ఆందోళనలకు దిగారు. రోడ్లపై టైర్లు తగులబెట్టారు. ఏటీ నాయకుడు కనన్ సింగ్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ఇందులో ఎక్కువగా యువకులే ఉన్నారు. ఇంఫాల్‌లోని క్వాకీథెల్ ప్రాంతంలో కాల్పులు కూడా చోటు చేసుకున్నాయని తాము శబ్దం విన్నామని స్థానికులు తెలిపారు.

ఐదుజిల్లాల్లో ఇంటర్నెట్ బంద్..

నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే దీని కోసం అక్కడి భద్రతా సిబ్బంది ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మైటీ గ్రూప్ అరంబై టెంగోల్ నాయకుడిని అరెస్టు చేసిన తరువాత శాంతిభద్రతల సమస్యలను ఏర్పడే అవకాశం ఉందని.. అక్కడి ప్రభుత్వం 11:45 గంటల నుంచి ఐదు రోజుల పాటు ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబాల్, బిష్ణుపూర్ మరియు కాక్చింగ్ ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. సోసల్ మీడియాను దుర్వినియోగం చేసినా, రెచ్చ గొట్టే పిక్చర్స్ పెట్టినా, వీడియోలను వ్యాప్తి చేసినా చర్యలు తీసుకుంటామని కమిషనర్-కమ్-సెక్రటరీ ఎన్ అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 

Also Read: French Open: మట్టికోర్టు మహారాణి కోకో గాఫ్..

Advertisment
తాజా కథనాలు