Israel-Syria: మిలిటరీ ఆఫీస్‌లే టార్గెట్.. సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్

సిరియాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. డెమాస్కస్‌లోని మిలిటరీ కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించగా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దాడులకు ప్రతి దాడులు తప్పవని సిరియా హెచ్చరించింది. 

New Update

సిరియాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. డెమాస్కస్‌లోని మిలిటరీ కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించగా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఇజ్రాయెల్ జరుపుతున్న ఈ దాడులను సిరియా ఖండించింది. దాడులకు ప్రతి దాడులు తప్పవని హెచ్చరించింది. 

ఇది కూడా చూడండి:TG News: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!

ఇది కూడా చూడండి:TG Murder: అక్రమ సంబంధం వల్లే హత్య..   చందు నాయక్‌ హత్య కేసులో సంచలన విషయాలు!

ఇజ్రాయెల్, సిరియా యుద్ధానికి మొదలు..

ఇదిలా ఉండగా సిరియాలోని స్వెయిదా రాష్ట్రంలో స్థానిక మిలీషియాల మధ్య జరిగిన సాయుధ సంఘర్షణలో ఇద్దరు పిల్లలుసహా 30 మందికి పైగా మరణించారు. 100 మంది వరకూ గాయపడ్డారని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. మైనారిటీ షియా తెగకు చెందిన ద్రూజ్‌ మిలీషియాకు, సున్నీ బెడ్విన్‌ తెగలకు మధ్య తొలుత సాయుధ ఘర్షణ ప్రారంభమైంది.

ఇది కూడా చూడండి:పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !

ఈ ఘర్షణను అదుపు చేసేందుకు ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగడంతో వాటిపై ఇజ్రాయెల్‌ దాడికి పూనుకుంది. ద్రూజ్‌ మిలీషియాకు మద్దతుగా తాము సిరియా సైన్యానికి చెందిన ట్యాంకులపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ ఘర్షణలో మృతుల సంఖ్య 50కిపైనే ఉంటుందని బ్రిటన్‌కు చెందిన సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ సంస్థ పేర్కొంది.

ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్‌ కార్డులు

attacks | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు