/rtv/media/media_files/2025/06/14/y45jdwtDNZEEzXK0a854.jpeg)
ఇజ్రాయిల్, ఇరాన్ పరస్పర దాడులు భీకర యుద్ధాన్ని తలపిస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున ఇరాన్ క్షిపణులతో రెండవ రౌండ్ దాడులకు దిగింది. దీంతో జెరూసలేంలో వైమానిక దాడి సైరన్‌లను మోగింది. ఇజ్రాయెల్ ఇంటర్‌సెప్టర్‌ల నుంచి వచ్చే పెద్ద శబ్దాలు రాజధాని అంతటా ప్రతిధ్వనించాయి. టెల్‌అవీవ్‌లో రెండు ఇరానియన్ క్షిపణులు అటాక్ చేశాయని స్థానికులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌లో టెల్ అవీవ్‌కు తూర్పున ఉన్న రామత్ గన్ నగరంలో తీవ్ర నష్టం వాటిల్లింది. వాహనాలు, ఇళ్లు భారీగా ధ్వంసమైయ్యాయి. ఇజ్రాయిల్ ఇరాన్‌పై చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మిస్సైల్స్ తో విరుచుకుపడింది.
Also Read : ఓటీటీలోకి అక్షయ్ కుమార్ హిస్టారికల్ డ్రామా!
Also Read : 6.5 తీవ్రతతో భారీ భూకంపం.. ప్రాణాలు గుప్పెట్లో పరుగో పరుగు
Iran Israel War
ఇజ్రాయెల్- శుక్రవారం ఇరాన్ అణు కేంద్రాలు, మిస్సైల్ స్థావరాలపై ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై విరుచుకుపడింది. 200 యుద్ధ విమానాలతో ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిచింది. సీక్రెట్ డ్రోన్లను ఇరాన్ భూభాగంలోకి పంపి దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ దాడుల్లో 100 మంది ఇరాన్ పౌరులు హతమయ్యారు. ఈ దాడుల్లో ముగ్గురు ఆర్మీ అధికారులు, అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు. 350 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ శనివారం ఉదయం ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ అణుస్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్‌తో దాడి చేసింది. డైమోనా న్యూక్లియర్ ప్లాంట్‌పై దాడి చేసినట్లు ఇరాన్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పదుల కొద్ది బాలిస్టిక్ మిసైళ్లతో మెరుపు దాడులు చేసింది. 40 మంది ఇజ్రాయెల్ పౌరులకు గాయాలు అయ్యాయి. 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాల్ని ఇరాన్ నేలమట్టం చేసింది.
Also Read : విమాన ప్రమాదం.. డాక్టర్ కావాలనే 20 ఏళ్ల యువకుడి కన్నీటి కథ..!
Also Read : పెద్దవుతున్న యుద్ధం.. ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్
israel | attack on israel | hamas-israel | hamas attacks israel | iran israel war | iran israel relations | iran israel conflict | iran israel attack | iran israel war news today | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu