/rtv/media/media_files/2025/06/24/khatar-2025-06-24-07-39-03.jpg)
gulf countries Air Base
అమెరికా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ దాడులు మొదలెట్టింది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న నాలుగు యూఎస్ మిలటరీ బేస్ ల మీద ఇరాన్ దాడులు చేసింది. ఖతార్ తో పాటూ ఇరాక్, బహ్రెయిన్, ఇరాక్, కువైట్ లలో దాడి చేసిందని అంతర్జీతీయ మీడియా తెలిపింది. ఖతార్ రాజధానిలోని దోహాలో పేలుళ్ళు కనిపించాయి. దీంతో ఖతార్ తో సహా గల్ఫ్ కంట్రీస్ అన్నీ తమ గగనతలాలన్నీ మూసేసామని ప్రకటించాయి. దీంతో ఖతార్, ఇతిహాద్, ఎమిరేట్స్ లాంటివన్నీ తమ ఫ్లైట్లను క్యాన్సిల్ చేస్తోంది. అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి ఈ సర్వీసులన్నీ రద్దవుతున్నాయి. అయితే ఖతార్ మాత్రం తమ గగనతలాన్ని మళ్ళీ తెరిచామని ప్రకటించింది. కానీ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని చెప్పింది.
Also Read : రెచ్చిపోతున్న ఇరాన్..ఇజ్రాయెల్ పైనా దాడులు
Also Read : HYDలో దారుణం.. కూతురిపై తండ్రి అత్యాచారయత్నం
ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..
మడిల్ ఈస్ట్ కారణంగా ఎయిర్ ఇండియా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ ప్రాంతం నుంచి వెళ్లే తమ అన్ని విమాన సర్వీసులను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమాసియాలోని కంట్రీస్, నార్త్ అమెరికా లోని పలు ప్రాంతాలు, యూరప్ కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కాస్త ప్రశాంతత వచ్చే వరకు, తదుపరి ఆర్డర్లు ఇచ్చేవరకు విమాన సర్వీసులు ఉండవని చెప్పింది. భారత్ నుంచి బయలుదేరిన వాటిని కూడా ఇతర మార్గాల్లో తిరిగి వెనక్కి రప్పిస్తున్నట్లు చెప్పింది. పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని..ప్రయాణికులకు కూడా అప్ డేట్స్ ఇస్తూ ఉంటామని చెప్పింది. ప్రయాణికులు భద్రత, క్షేమం కోసమే ఈ చర్యలను చేపట్టామని ఎయిర్ ఇండియా యాజమాన్యం తెలిపింది.
Also Read : భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ట్రంప్ ప్రకటనే కారణం
Also Read : సోషల్ మీడియా అకౌంట్లు పబ్లిక్‌లో పెడితేనే.. అమెరికాకు వీసాలు
air india | khatar | gulf | today-latest-news-in-telugu | telugu-news | international news in telugu | latest-telugu-news
Follow Us