ఖతార్ రాజుకు ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీ విమానాశ్రయంలో స్వాగతించారు. 2రోజుల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ఇండియాకు చేరుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోదీతో ఆయన చర్చలు జరపనున్నారు.