/rtv/media/media_files/2025/09/05/infant-sleeping-at-home-in-up-snatched-by-monkeys-2025-09-05-20-53-03.jpg)
Infant sleeping at home in UP snatched by monkeys
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో దారుణం జరిగింది. ఓ కోతుల గుంపు రెండేళ్ల పాపను లాక్కెళ్లి హతమార్చిన ఘటన కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సీతాపూర్ అనే గ్రామంలో ఓ ఇంట్లో కోతులు ప్రవేశించాయి. అదే సమయంలో అందులో రెండేళ్ల పాప నిద్రపోతోంది. దీంతో కోతులు ఆ పాపను గాయపరుస్తూ, లాక్కెళ్లాయి. ఇంటిపైన ఉన్న నీళ్ల డ్రమ్ములో పడేశాయి. ఇంటిపై నుంచి పాప ఏడుపు శబ్దం వినిపిండచంతో బయటున్న కుటుంబ సభ్యులు హుటాహుటీనా పైకి చేరుకున్నారు.
Also Read: 50 వేల విగ్రహాలు.. 30 వేల మంది పోలీసులు.. ఈ సారి నిమజ్జనం ప్లాన్, రూట్ మ్యాప్ ఇదే!
Infant Snatched Monkey In UP
అక్కడ వెతకగా నీళ్ల డ్రమ్ములో పాప కనిపించింది. ఆ చిన్నారిని వెంటనే బయటకు తీసు ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆ పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సీతాపూర్ గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో కోతుల బెడత ఎక్కువగా ఉందని అధికారులకు ఎన్నోసార్లు చెప్పామని ధ్వజమెత్తారు. అయినప్పటికీ జిల్లా, అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు చేశారు.
Also Read: షాకింగ్ వీడియో- విడాకుల విషయంలో లొల్లి.. నడిరొడ్డుపై కాల్చి చంపిన భర్త
తరచుగా కోతులు(Monkeys) తమ గ్రామంలో చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయంటూ వాపోయారు. అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్లే ఆ రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిందంటూ మండిపడ్డారు. అంతేకాదు ఈ ఘటనకు కారణమైన అటవీశాఖ అధికారులపై కఠినంగా చర్యలు తీసుకోవాంటూ డిమాండ్ చేశారు.
Also Read: తెలంగాణలో విషాదం.. ఆమెకు 15, అతడికి 38 ఏళ్లు.. భద్రాచలం లాడ్జిలో ఏం చేశారంటే?
ఇదిలాఉండగా మహారాష్ట్ర లో మరో విషాద ఘటన జరిగింది. కొల్హాపూర్(Kolhapur) లో ఓ పదేళ్ల బాలుడు గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయాడు. వినాయక మండపం వద్ద ఆడుకుంటుండగా ఆ బాలుడు అస్వస్థకు గురయ్యాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తల్లి ఒడిలో పడుకున్న కాసేపటికే గుండెపోటుకు గురై మృతి చెందాడు. మృతుడిని శ్రావణ్ గవాడేగా గుర్తించారు. 4వ తరగతి చదువుతున్న శ్రావణ్ తన తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. ఆ కుటుంబం నాలుగేళ్ల క్రితమే తమ చిన్న కూతురును కోల్పోయింది. ఇప్పుడు శ్రావణ్ కూడా అకస్మాత్తుగా మరణించడం గుండెలను పిండేస్తోంది.మరోవైపు ఆగస్టు 31న ముంబైలోని ఆజాద్ మైదానంలో మరో విషాదం చోటుచేసుకుంది. 45 ఏళ్ల మరాఠా కోటా నిరసనకారుడు గుండెపోటుకు గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు.
Also Read: ఏపీలో ఓ ఐఏఎస్ బాగోతం.. సైలెంట్ గా మహిళను లేపేసి.. ఎంతకు తెగించాడంటే ?