/rtv/media/media_files/2025/09/05/telangana-love-couple-suicide-in-bhadrachalam-private-lodge-1-2025-09-05-14-47-31.jpg)
Telangana Love Couple Suicide
భద్రాచలం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక లాడ్జిలో ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ప్రాథమిక విచారణలో ప్రేమ వివాహానికి పెద్దలు నిరాకరించడంతోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తేలింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Love Couple Suicide
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాకు చెందిన రవి (38)కి పెళ్లై ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం అశ్వాపురం మండలం పాములపల్లి గ్రామానికి చెందిన 15 ఏళ్ల మైనర్ బాలిక తన బంధువుల ఇంటికి తరచూ వెళ్తూ రవిపై మనసు పారేసుకుంది. దీంతో వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమాయణంలో మునిగి తేలారు. అయితే ఈ ప్రేమ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో ఆమెను తన తల్లిదండ్రులు మందలించారు. అనంతరం రవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అశ్వాపురం పోలీసులు రవిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఇలా దాదాపు 45 రోజుల పాటు రవి జైలు జీవితం గడిపాడు. ఇటీవలే అతడు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. అయితే పోక్సో కేసు విచారణకు సంబంధించిన మాత్రం రవి వాయిదాలకు డుమ్మా కొట్టాడు. ఈ క్రమంలోనే రవి, ఆ మైనర్ బాలిక ఇద్దరూ కలిసి పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జికి వెళ్లారు. తమ ప్రేమకు కుటుంబసభ్యులు అడ్డు వస్తున్నారన్న ఆవేదనతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ రవి, ఆ బాలిక ---పురుగుల మందు తాగారు. అనంతరం లాడ్జిలో నుంచి శబ్ధాలు రావడంతో సిబ్బంది గమనించారు. దీంతో వెంటనే డోర్లు బద్దలు కొట్టి లోపలకు వెళ్లగా ---పురుగుల మందు తాగి రవి స్పాట్‌లోనే చనిపోయి కనిపించాడు. అనంతరం కొన ఊపిరితో ఉన్న ఆ బాలికను సమీప హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. ఆమె అక్కడ ప్రాణాలతో పోరాడుతూ చివరికి చివరి శ్వాస విడిచింది.
లాడ్జి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడు రవి పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు. నాన్న నాన్న అంటూ బోరున ఏడ్చారు. ఈ సంఘటన భద్రాచలం పట్టణంలో విషాదాన్ని నింపింది. ప్రేమ వివాహాలకు కుటుంబాల నుండి వ్యతిరేకత ఎదురైతే, యువతీ యువకులు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం విచారకరం