Husband killed wife: షాకింగ్ వీడియో- విడాకుల విషయంలో లొల్లి.. నడిరొడ్డుపై కాల్చి చంపిన భర్త

UPలోని గోరఖ్‌పూర్‌లో భార్యా భర్తల మధ్య జరిగిన గొడవ విషాదాన్ని నింపింది. భర్త విశ్వకర్మ విడాకులు కోరగా.. భార్య మమత దానికి ఒప్పుకోలేదు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భర్త పిస్టల్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపి తన భార్యను హత్య చేశాడు.

New Update
Husband killed wife

Husband killed wife:

భార్యా భర్తల మధ్య వివాదాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే కోపం కట్టలు తెంచుకుని ప్రాణాలు బలిచేసుకుంటున్నారు. క్షణకావేశంలో తీసుకున్న నిర్ణయాలు కుటుంబాలను, కన్న బిడ్డలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా భార్య భర్తలు చంపుకుంటున్నారు. అక్రమ సంబంధాల కారణంగానే ఎక్కువగా ఈ వ్యవహారాలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఒక షాకింగ్ ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

gorakhpur man shoots his wife

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి అత్యంత క్రూరంగా, జాలి దయ లేకుండా నడి రోడ్డుపై తన భార్యను గన్‌తో కాల్చి చంపాడు. విడాకుల విషయంలో గొడవ జరిగి.. అది కాస్త ఉగ్రరూపం దాల్చి ప్రాణాలు పోయేంతవరకు వచ్చింది. అయితే తండ్రికి ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని కూతురు తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

విశ్వకర్మ చౌహాన్, మమతా చౌహాన్ (32) కు గత 15 ఏళ్ల క్రితం వివాహం అయింది. ఈ దంపతులకు 13 ఏళ్ల కూతురు ఉంది. ఆమె ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుంది. అయితే వీరిద్దరి మధ్య గత రెండేళ్లుగా విడాకుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో మమతా చౌహాన్ తన కూతురితో కలిసి వేరుగా జీవిస్తుంది. అదే క్రమంలో భర్త విశ్వకర్మ చౌహన్ విడాకులు కావాలని తన భార్యను ఎన్నో సార్లు డిమాండ్ చేయగా.. ఆమె కొన్ని కండీషన్లు పెట్టింది. 

విడాకులకు అంగీకరించే ముందు తన కూతురి సంరక్షణ కోసం వ్యవసాయ భూమిని ఇవ్వాలని కోరింది. ఈ విషయంలోనే-- షాపూర్ ప్రాంతంలోని జైల్ రోడ్డులో ఒక దుకాణం బయట ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో మరింత ఊగిపోయిన విశ్వకర్మ చౌహాన్.. వెంటనే తన వద్ద ఉన్న పిస్టల్‌ను తీసి తన భార్య మమతా చౌహాన్‌పై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె స్పాట్‌లోనే మృతి చెందింది. అందుకు సంబంధించిన ఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డైంది. 

అనంతరం ఆమెను హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత మృతురాలి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తండ్రి విశ్వకర్మ చౌహాన్‌ తన తల్లిని ఎంతో వేధించాడని, ఆయనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు విశ్వకర్మను అరెస్టు చేశారు. ఈ సంఘటనలో ఉపయోగించిన 01 అక్రమ పిస్టల్, 03 లైవ్ కార్ట్రిడ్జ్‌లు, 02 ఖాళీ కార్ట్రిడ్జ్‌లు అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు

Advertisment
తాజా కథనాలు