/rtv/media/media_files/2025/09/04/khairatabad-ganesh-immersion-2025-09-04-12-53-06.jpg)
Khairatabad ganesh immersion
Vinayaka immersion: తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాథుడు నిమజ్జనానికి తరలిపోనున్నాడు. శనివారం ఉదయం నుంచే నగర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం ప్రారంభం కానుంది. దీనికోసం అధికారులు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి శోభాయాత్రలు నగర వ్యాప్తంగా సుమారు 303 కిలోమీటర్ల మేర కొనసాగనున్నాయి. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి మొత్తం 30 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. అదనంగా 160 యాక్షన్ టీంలు సిద్ధంగా ఉన్నాయి. ప్రజల భద్రత కోసం 13 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. GHMC కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. నిమజ్జనానికి నగరంలో 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులు సిద్ధం చేసింది. ఆయా చెరువులు వద్ద నిమజ్జనానికి 134 స్థిర క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు, హుస్సేన్ సాగర్‌లో 9 బోట్లు, అత్యవసర పరిస్థితుల కోసం 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ఇక నగరాన్ని శుభ్రం చేయడానికి14,486 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించింది. రాత్రి వేళల్లో నిమజ్జన చేయడం కోసం 56,187 విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. అధికారులు అంచనా ప్రకారం, సెప్టెంబర్ 6న శనివారం సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం శనివారం రోజు మధ్యాహ్నం 1:30 గంటలలోపు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
#𝐇𝐘𝐃𝐓𝐏𝐢𝐧𝐟𝐨
— Hyderabad Traffic Police (@HYDTP) September 5, 2025
𝐓 𝐑 𝐀 𝐅 𝐅 𝐈 𝐂 𝐀 𝐃 𝐕 𝐈 𝐒 𝐎 𝐑 𝐘
🚨 #𝐓𝐫𝐚𝐟𝐟𝐢𝐜𝐀𝐥𝐞𝐫𝐭 🚨
𝐈𝐧 𝐯𝐢𝐞𝐰 𝐨𝐟 𝐭𝐡𝐞 #𝐆𝐚𝐧𝐞𝐬𝐡𝐈𝐦𝐦𝐞𝐫𝐬𝐢𝐨𝐧 𝐩𝐫𝐨𝐜𝐞𝐬𝐬𝐢𝐨𝐧 𝐨𝐧 𝟎𝟔-𝟎𝟗-𝟐𝟎𝟐𝟓, 𝐬𝐩𝐞𝐜𝐢𝐚𝐥 𝐭𝐫𝐚𝐟𝐟𝐢𝐜 𝐫𝐞𝐠𝐮𝐥𝐚𝐭𝐢𝐨𝐧𝐬 𝐰𝐢𝐥𝐥 𝐛𝐞 𝐢𝐧… pic.twitter.com/EPYEmoFgDp
24 గంటల సమయం.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు
నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వినాయకుల నిమజ్జనం శనివారం ఉదయం 6 గంటలనుంచి ప్రారంభమై ఆదివారం ఉదయం 10 గంటల వరకు ముగిసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ విషయాన్ని గుర్తించి నగరవాసులు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన శోభాయాత్ర చార్మినార్ నుంచి అబిడ్స్, లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్ చేరుకుని నెక్లెస్ రోడ్ వైపు సాగుతుంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ప్యాట్నీ, పారడైజ్, రాణిగంజ్, కర్బలామైదాన్ నుంచి ట్యాంక్‌బండ్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. టోలిచౌకీ, మెహిదీపట్నం నుంచి వచ్చేవిగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుంటాయి. టప్పచబుత్ర, ఆసిఫ్‌నగర్ నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజే మార్కెట్ వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రధాన నిమజ్జన రూట్లలో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. కనుక ఈ మార్గంలో వెళ్లాలనుకునేవారు ప్రత్యామ్నయం రూట్లను ఎంచుకోవడం ఉత్తమం.
రాష్ట్ర వ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. పోలీస్ శాఖతో పాటు #GHMC గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, హైదరాబాద్ కలెక్టర్, నిన్న క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. 30 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. pic.twitter.com/JeuQJ0oIpw
— AIR News Hyderabad (@airnews_hyd) September 4, 2025
సౌత్ ఈస్ట్ జోన్ కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మూసారాంబాగ్, చంచల్‌గూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు మళ్లింపులు ఉంటాయి. అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, దరుశ్షిఫా ప్రాంతాలలో ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. శివాజీ బ్రిడ్జ్, పుత్లిబౌలి, హిమాయత్‌నగర్, వైఎంసిఏ ప్రాంతాలలో ఆంక్షలు అమలులో ఉంటాయి. లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, బుద్ధభవన్ జంక్షన్లలో వాహనాలను అనుమతించరు. నార్త్ జోన్: పాట్నీ, పరడైజ్, రాణిగంజ్ ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లిస్తారు.
నిమజ్జనానికి వచ్చే వాహనాల కోసం ఎన్టీఆర్ స్టేడియం, ట్యాంక్ బండ్ దిగువన కట్టమైసమ్మ దేవాలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక వైపు, ఆదర్శనగర్, బీఆర్‌కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయిన తర్వాత లారీలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాత్రమే అనుమతిస్తారు. సెప్టెంబర్ 6, ఉదయం 8 నుంచి సెప్టెంబర్ 7, రాత్రి 11 వరకు నగరంలోకి లారీల ప్రవేశం ఉండదు. రద్దీ సమయంలో మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులను అనుమతిస్తారు. అంతర్ రాష్ట్ర, జిల్లా బస్సులను చాదర్‌ఘాట్ వైపు మాత్రమే దారి మళ్లిస్తారు. ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి చౌరస్తా, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా జంక్షన్లను దాటకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. విమానాశ్రయానికి వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే ఉపయోగించాలని పోలీసులు సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లేవారు బేగంపేట - పారడైజ్ మార్గాన్ని ఎంచుకోవాలి.
వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7న ఉదయం 10గంటల వరకు హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరవాసులు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
బాలాపూర్ నుంచి వచ్చే ప్రధాన శోభాయాత్ర చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్‌బండ్ మీదుగా నెక్లెస్ రోడ్ వైపు వెళ్తుంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ప్యాట్నీ, పారడైజ్, రాణిగంజ్, కర్బలామైదాన్ నుంచి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటాయి. టోలిచౌకీ, మెహిదీపట్నం నుంచి వచ్చేవి ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుంటాయి. టప్పచబుత్ర, ఆసిఫ్‌నగర్ నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజే మార్కెట్‌లోకి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రధాన నిమజ్జన రూట్లలో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు.
సౌత్ ఈస్ట్ జోన్ కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మూసారాంబాగ్, చంచల్‌గూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు మళ్లింపులు ఉంటాయి. అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, దరుశ్షిఫా ప్రాంతాలలో ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. శివాజీ బ్రిడ్జ్, పుత్లిబౌలి, హిమాయత్‌నగర్, వైఎంసిఏ ప్రాంతాలలో ఆంక్షలు అమలులో ఉంటాయి. లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, బుద్ధభవన్ జంక్షన్లలో వాహనాలను అనుమతించరు. నార్త్ జోన్: పాట్నీ, పరడైజ్, రాణిగంజ్ ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లిస్తారు.
నేడు సీఎం దర్శనం
ఖైరతాబాద్ లో ఈసారి ఏడు ముఖాల శక్తి మహాగణపతిగా గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు.ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఖైరతాబాద్‌లోని వినాయక దర్శనానికి వెళ్లనున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ లు దర్శించుకోనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ఇది కూడా చూడండి:TG Dasara Holidays: తెలంగాణ స్టూడెంట్స్ కు అదిరిపోయే శుభవార్త.. దసరా సెలవులు ప్రకటించిన సర్కార్.. లిస్ట్ ఇదే