India -Pakistan Tensions: పాకిస్థాన్‌ గొంతు ఎండేలా భారత్‌ మరో సంచలన నిర్ణయం

పాకిస్థాన్ గొంతు ఎండేలా భారత్ మరో నిర్ణయం తీసుకుంది. తాజాగా జీలమ్‌ నదిపై ఉన్న ఈ కిషన్‌గంగా డ్యామ్‌ నుంచి నీటి విడుదలను ఆపాలని నిర్ణయించింది. ఇప్పటికే చినాబ్‌ నదిపై ఉన్న బాగ్‌లిహర్ డ్యామ్‌ గేట్లు భారత్‌ ముసివేసింది.

New Update
India -pakistan war tensions, another big Shock to pakistan

India -pakistan war tensions, another big Shock to pakistan

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్ సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇప్పుడు మళ్లీ పాకస్థాన్ గొంతు ఎండేలా మరో నిర్ణయం తీసుకుంది. తాజాగా కిషన్ గంగా ప్రాజెక్టు నుంచి విడుదలకు బ్రేక్ ఇచ్చింది. జీలమ్‌ నదిపై ఉన్న ఈ కిషన్‌గంగా డ్యామ్‌ నుంచి నీటి విడుదలను ఆపాలని నిర్ణయించింది. ఇప్పటికే చినాబ్‌ నదిపై ఉన్న బాగ్‌లిహర్ డ్యామ్‌ గేట్లు భారత్‌ ముసివేసింది. ఇది జమ్మూలోని రాంబన్‌లో చినాబ్‌ నదిపై ఉంది. విద్యుదుత్పత్తికి ఉద్దేశించిన ప్రాజెక్టు నుంచి నీటిని వదలకపోవడం వల్ల పాకిస్థాన్‌లో పంజాబ్‌ ప్రావిన్సుకు సాగునీరు అందడం లేదు. 

Also Read: ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలతో దాడి !.. పుతిన్ కీలక ప్రకటన

India -Pakistan War Tensions

దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతను పెంచేలా మరిన్ని పరిణామాలు జరుగుతున్నాయి. 1960లో భారత్-పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఒప్పందంతో అత్యధికంగా పాకిస్థాన్‌కు లాభం చేకూరుతోంది. దాదాపు 80 శాతం పాకిస్థాన్‌కు ఈ నీరు అందుతోంది. ఈ ఒప్పందం భారత్‌ నిలిపివేయడంతో పాకిస్థాన్‌కు పెద్ద దెబ్బ పడిన సంగతి తెలిసిందే. ఇక పాకిస్థాన్‌కు మరో బిగ్‌షాక్‌ తగిలింది. ముస్లిం దేశాలు పాక్‌ను ఏకాకి చేశాయి. ఆ దేశానికి మద్దతు ఇచ్చేందుకు ముస్లిం దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ ఇండియా వైపే ఉన్నాయి. భారత్‌తో ఆ దేశాలకు బలమైన వ్యాపార సంబంధాలు ఉండటమే దీనికి కారణం. అయితే ఏకపక్షంగా పాకిస్థాన్‌కు సపోర్ట్‌ ఇచ్చేందుకు సౌదీ నిరాకరించింది. 

Also Read : కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!

మరోవైపు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజ ఆసీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ వాయుసేనతో ఘర్షణలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని అన్నారు.  పాకిస్థాన్‌కు చెందిన ఏఆర్‌వై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికే తమ గగనతలంలోకి రఫేల్‌ యుద్ధ విమానాలు రావడానికి యత్నించాయని.. వాటిని తాము అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. 

Also Read: పాక్ కు భారత సైనిక సమాచారం లీక్...ఇద్దరు ఇంటి దొంగల అరెస్ట్

Also Read: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)

 

Pahalgam attack | rtv-news | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు