/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Arrest.jpg)
arrest
Arrested : భారత సైనిక దళాల కదలికలకు సంబంధించిన అత్యంత రహస్యమైన సమాచారాన్ని, ఫొటోలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్న ఇద్దరు వ్యక్తులను పంజాబ్‌లో అరెస్ట్ చేశారు. అమృత్‌సర్‌కు చెందిన పాలక్ షేర్ మసిహ్, సూర్ మసిహ్‌లు భారత సైన్యం రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు అందజేస్తున్నారని దర్యాప్తులో తేలడంతో అమృత్‌సర్ రూరల్ పోలీసులు వాళ్లను అరెస్టు చేశారు.
ఇది కూడా చూడండి: High Court : నోటీసులిచ్చిన అక్రమ నిర్మాణాలను సీజ్ చేయండి.. GHMCకీ హైకోర్టు ఆదేశం
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో 26 మంది మరణించారు. దీంతో భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాంటి వేళ భారత్ సైన్యానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని దాయాది దేశం పాకిస్థాన్‌కు అందించిన నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులను అమృత్‌సర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అమృత్‌సర్‌లోని కంటోన్మెంట్ ఏరియాతోపాటు ఎయిర్ బేస్‌కు సంబంధించిన పలు చిత్రాలను సైతం వీరు పాకిస్థానీ అధికారులకు అందజేసినట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం తెలిపారు. ఆ ఇద్దరు ఇంటి దొంగలు పాకిస్థాన్‌లోని ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తు సమాచారం ప్రకారం.. హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు అలియాస్ హ్యాపీ సూచనల మేరకు వీరు పని చేస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం హర్‌ప్రీత్ సింగ్ అమృత్‌సర్ జైల్లో ఉన్నాడు. అరెస్టైన నిందితుల దగ్గర అత్యంత సున్నితమైన విజువల్స్‌తోపాటు, డేటా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అధికార రహస్యాల చట్టం కింద వీరిపై కేసులు పెట్టారు. దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరిన్ని అరెస్టులు ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Cyber Crime : స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పేరుతో మహిళకు టోకరా...రూ.2.7 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
జాతీయ భద్రతకు హాని కలిగించే విధంగా హై సెక్యూరిటీ విజువల్స్‌తోపాటు పలు కీలక వివరాలను శత్రు దేశపు నిఘా వర్గాలకు అందించినట్లు ఈ విచారణలో తెలిపారన్నారు. అధికారిక రహస్యాల చట్టం కింద వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు.పహల్గాం దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ సరిహద్దుల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అలాగే నిఘాను సైతం పట్టిష్టం చేశారు. ఆ క్రమంలో ఈ ఇద్దరిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.
ఇది కూడా చూడండి: Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)