IND-PAK WAR: భారత్ లోకి 21 మంది పాకిస్తానీయులు.. ఆ పోర్టులో హైఅలర్ట్!

భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒడిశాలోని పరదీప్‌ పోర్టులోని ‘ఎమ్‌టీ సైరెన్‌ II’ నౌకలో 21 మంది పాక్‌ సిబ్బంది ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. 

New Update
pak port

Odisha Paradip port 21 Pakistani arrested

IND-PAK WAR: భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒడిశాలోని పరదీప్‌ పోర్టులోని ‘ఎమ్‌టీ సైరెన్‌ II’ నౌకలో 21 మంది పాక్‌ సిబ్బంది ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. 

Also Read :  బాయ్‌కాట్‌ తుర్కియే.. ఊపందుకున్న నినాదం...టూరిజంపై తీవ్ర ప్రభావం

21 మంది పాకిస్తానీయులే..

ఈ మేరకు దక్షిణ కొరియా నుంచి సింగపూర్‌ మీదుగా పాకిస్తానీయులతో కూడిన ‘ఎమ్‌టీ సైరెన్‌ II’ నౌక పరదీప్‌ పోర్టుకు చేరుకుంది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సంస్థ కోసం ముడి చమురును తీసుకురాగా.. అధికారులు ఇందులో తనిఖీలు చేపట్టారు. మొత్తం 25 మంది ఉండగా అందులో 21 మంది పాకిస్తానీయులే ఉండటంతో అలర్ట్ అయ్యారు. వెంటనే ఒడిశా మెరైన్‌ పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని పోర్టులో భద్రతను పెంచినట్లు మెరైన్‌ ఇన్‌స్పెక్టర్‌ బబితా దుహేరి తెలిపారు.

ఇది కూడా చూడండి: AP Crime: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!

'ఈ నౌక పోర్టుకు 20 కి.మీ. దూరంలో ‘పీఎం బెర్త్‌’ వద్ద లంగర్‌ వేసి ఉంది. 11,350 మెట్రిక్‌ టన్నుల ముడి చమురు రవాణా చేస్తోంది. ముడి చమురు అన్‌లోడింగ్‌ పూర్తయ్యే వరకూ 25 మంది సిబ్బంది నౌకను వీడకుండా ఆదేశాలు జారీ చేశాం. భద్రతా సిబ్బంది కాపలా కాస్తున్నారు. పాక్‌ తో యుద్ధం వేళ ఓడరేవు ప్రాంతంలో హైఅలర్ట్‌ ప్రకటించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరీశీలస్తున్నాం' అని బబితా వివరించారు. 

ఇది కూడా చూడండి: Ind-Pak: మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి..పాక్ విదేశాంగ శాఖ

Also Read :  హైదరాబాద్‌లో విషాదం.. ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన పిల్లర్ గుంత!

 port | telugu-news | today telugu news | latest-telugu-news | breaking news in telugu | national news in Telugu | international news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు