/rtv/media/media_files/2025/05/14/66HmFIGjRyDcYParViKT.jpg)
Boycott Turkey
Boycott Turkey: భారత్ పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తల సమయంలో కొన్ని దేశాలు పాక్ కు బహిరంగ మద్దతునిచ్చాయి. అందులో టర్కి(తుర్కియే) ఒక్కటి. భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన తుర్కియే కు భారత్ సాయం చేస్తే దాన్ని విస్మరించి పాక్ కు బహిరంగ మద్దతు ప్రకటించింది. అంతేకాక డ్రోన్లను అందించి మనదేశంపైకి ఉసిగొల్పింది. అయితే ఇప్పుడు ఆ దేశం తగిన శాస్తి అనుభవిస్తోంది. టూరిజంపై ఆధారపడిన తుర్కియేకు ఇండియా నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దాయాదికి తుర్కియే మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం ఊపందుకుంది.
ఇది కూడా చూడండి: Earth Quake: గ్రీస్ లో భారీ భూకంపం..
యుద్ధ సమయంలో పాక్‌కు తుర్కియే మద్దతు ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది సోషల్ మీడియా వేదికగా ‘బాయ్‌కాట్, బాన్ తుర్కియే’ని ట్రెండ్ చేస్తున్నారు. మొన్నటివరకు సోషల్‌మీడియాలో మాత్రమే కొనసాగిన ఈ ట్రెండ్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో అన్ని రంగాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే దాని ప్రభావం తుర్కియే టూరిజంపై పడింది. ఆ దేశానికి వెళ్లాలనుకునే అనేక మంది భారతీయ పర్యాటకులు విమాన టికెట్లు, హోటళ్ల బుకింగ్‌లను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా బుకింగ్‌లు వాయిదా లేదా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తున్నది. రాజధాని అంకారా టూరిజం తీవ్రంగా ప్రభావితమైంది. అంతేకాదు పలు టూరిస్టు ఏజేన్సీలు సైతం తుర్కియే బుకింగ్‌లను నిలిపివేయడం గమనార్హం.
ఇది కూడా చూడండి: AP Crime: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!
యాపిల్ మార్కెట్ ఔట్
ఈ ప్రభావం కేవలం టూరిజం మీదనే కాదు. యాపిల్ మార్కెట్‌పై కూడా పడింది. తుక్కియే యాపిళ్లు ఎక్కువగా పండించే దేశాల్లో ఒకటి. తుర్కియే యాపిళ్ల టర్నోవర్ ఒక సీజన్‌లో రూ.1000-1200 కోట్ల వరకు ఉంటుంది. పాక్‌కు మద్ధతునిచ్చినందుకు ప్రతీగా తుర్కియే యాపిళ్లను దిగుమతి చేసుకోవద్దని పుణె వ్యాపారులు నిర్ణయించారు. పలువురు దిగుమతులను తగ్గించుకోవడంతో యాపిళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడి యాపిళ్ల ధరలు బాగా పెరిగాయి. కాగా తుర్కియే కు ప్రత్యాన్మయంగా ఇరాన్, వాషింగ్టన్, న్యూజిలాండ్‌లతోపాటు మన దేశంలోని హిమాచల్, ఉత్తరాఖండ్‌ల నుంచి యాపిళ్లను దిగుమతి చేసుకునేందుకు పుణె వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు.
ఇది కూడా చూడండి: Ind-Pak: మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి..పాక్ విదేశాంగ శాఖ
విత్ హెల్డ్‌లో తుర్కియే బ్రాడ్ కాస్టర్
The 'X' account of Turkish broadcaster 'TRT World' withheld in India. pic.twitter.com/in72SVkubD
— ANI (@ANI) May 14, 2025
మరో వైపు పాక్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తున్న తుర్కియే పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ టీఆర్‌టీ వరల్డ్ ఎక్స్ ఖాతాను భారత్ విత్ హెల్డ్‌లో పెట్టింది. దానితో పాటు దాయాది దేశానికి మద్దతుగా ప్రచారం చేస్తున్న పలు అంతర్జాతీయ మీడియా సంస్థలపై భారత్ చర్యలకు దిగింది. ఇప్పటికే పాక్‌కు అనుకూలంగా ప్రచారం చేసిన చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఖాతాను భారత్ నిలిపివేసింది. తాజాగా తుర్కియే పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ టీఆర్‌టీ వరల్డ్‌ను కూడా భారత్ బ్లాక్ చేసింది. ఆ అకౌంట్‌ను విత్‌హెల్డ్ లో ఉంచింది. అంతకు ముందు చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్, జిహువా న్యూస్ ఎక్స్ ఖాతాలను భారత్ విత్‌హెల్డ్‌లో ఉంచిన విషయం తెలిసిందే.
ఇది కూడా చూడండి: పాకిస్థాన్ కిరానా హిల్స్‌లో రహస్యం.. ఆర్మీ చేతికి చిక్కిన సమాచారం..!
tourism | apple