Singer Sunitha: లెజండ్రీ సింగర్ ఎస్. పీ బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో మొదలైన పాపులర్ సింగింగ్ షో పాడుతా తీయగా గత కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఎస్పీబీ మరణాంతరం ఆయన కుమారుడు చరణ్ షోను హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఈ షో నిర్వాహకులు, జడ్జీలపై కంటెస్టెంట్ ప్రవస్తి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. షో జడ్జెస్ గా వ్యవహరిస్తున్న ఆస్కార్ విజేతలు కీరవాణి, చంద్రబోస్, అలాగే సింగర్ సునీత పై ఆమె చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. కంటెస్టెంట్ పట్ల సింగర్ సునీత తీరు గురించి ప్రవస్తి చెప్పిన విషయాలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
కక్ష పెట్టుకున్నారు..
సింగర్ సునీత తనపై కక్ష పెట్టుకున్నారని ఆరోపించింది. తాను పాట పాడడానికి వేదికపైకి రాగానే ఇబ్బంది కలిగించే విధంగా మొహం పెట్టేదని.. కీరవాణికి తనపై లేనిపోనివి చెప్పేదని వాపోయింది. తప్పులు లేకపోవయినా కావాలనే నెగటివ్ కామెంట్స్ ఇచ్చేవారని ఎమోషనల్ అయ్యింది. కంటెస్టెంట్ల పట్ల ఎంతో సౌమ్యంగా, మర్యాదగా, సపోర్టుగా కనిపించే సునీత పై ఇలాంటి ఆరోపణలు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
కీరవాణి, సునీత, చంద్రబోస్లపై సంచలన ఆరోపణలు చేసిన సింగర్ ప్రవస్తి
— ChotaNews App (@ChotaNewsApp) April 21, 2025
నాపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది.. నన్ను కావాలనే ఏదో ఒక రకంగా పాయింట్ ఔట్ చేస్తున్నారు.
వచ్చే ఎపిసోడ్లో ఇద్దరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు.
జడ్జీలు, సీనియర్, జూనియర్ పట్ల వివక్ష చూపిస్తున్నారు.
పెళ్లిళ్లలో పాటలు… pic.twitter.com/myfOgI3PQt
అలాగే సింగర్ చంద్రబోస్ కూడా తనను టార్గెట్ చేశారని తెలిపింది. సునీత, కీరవాణి, చంద్రబోస్ జడ్జీ హోదాలో కూర్చొని కంటెస్టెంట్లకు అన్యాయం చేస్తున్నారని పేర్కొంది. తన జీవితం నాశనం చేశారని.. తన అవకాశాలు కూడా లాగేసుకున్నారని వాపోయింది. తన ఫ్యామిలీకి, తనకు ఏదైనా జరిగితే.. ఆ ముగ్గురే కారణమని సంచలన కామెంట్స్ చేసింది.
latest-news | telugu-news | cinema-news | singer-sunitha | Singer Pravasthi