Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఇలానే.. తర్వాత పోప్ ఎవరు?

పోప్ ఫ్రాన్సిస్ మరణాంతరం 15-20 రోజుల్లో కొత్త పోప్‌ను ఎన్నుకోనున్నారు. 80 ఏళ్లలోపు కార్డినల్స్ సిస్టీన్ చాపెల్‌లో రహస్యంగా సమావేశం అవుతారు. పోప్ అభ్యర్థికి మూడింట రెండు వంతుల మెజారిటీ ఓట్లు వచ్చే వరకూ ఎన్నిక ఉంటుంది.

New Update

కాథలిక్ క్రిస్టియన్ల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ల క్రైస్తవులకు మతపరమైన అధిపతి. 88ఏళ్ల వయసులో పోప్ వయోసంబంధ అనారోగ్య కారణాలతో ఏప్రిల్ 21న చనిపోయారు. గతకొన్ని రోజులుగా పోప్‌ శ్వాసకోస సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఫిబ్రవరి 14 నుంచి ఆయన 38 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత మార్చిలో డిశ్చార్జి అయ్యారు. 2013లో 16వ పోప్‌ బెనిడెక్ట్‌ తర్వాత పోప్‌ ఫ్రాన్సిస్ ఈ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం జరిగిన ఈస్టర్‌ వేడుకల్లో కూడా పోప్‌ అనారోగ్యం కారణంగా పాల్గొనలేదు. అయితే ఈస్టర్‌ మరుసటి రోజే ఆయన తుదిశ్వాస విడిచారు. పోప్ తన జీవితాన్ని చర్చి సేవకే అంకితం చేశారని వాటికన్ చర్చి ముఖ్య అధికారి (కామెరెంగో) కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ తెలిపారు. 

వాటికన్ చర్చి ఆస్తి నిర్వహకుడు కామెరెంగో మూడు సార్లు పోప్‌ను పిలిస్తాడు. అతను పలకకపోతే అధికారికంగా పోప్ మరణాన్ని దృవీకిరిస్తారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం అనంతరం ఆ బాధ్యతలు చేపట్టబోయేది ఎవరనేది త్వరలోనే నిర్ణయిస్తాయి. 

Also Read: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?

కామెర్లెంగో (వాటికన్ యొక్క ఆస్తి మరియు ఆదాయ నిర్వాహకుడు) మొదట మరణాన్ని ధృవీకరిస్తాడు. అతను పోప్ బాప్టిస్మల్ పేరును మూడుసార్లు పిలుస్తాడు. ప్రతిస్పందన లేకపోతే, పోప్ చనిపోయాడని ప్రకటిస్తాడు. 1963 వరకు పోప్ మరణం తర్వాత అతని నుదిటిపై చిన్న వెండి సుత్తితో కొట్టే ఆచారం ఉండేది. పోప్ ఫ్రాన్సిస్ మృతితో వాటికన్ సిటీలో కాథలిక్ క్రిస్టియన్ మతాచారాల ప్రకారం ఆయన అంతిమ సంస్కారాలు చేస్తారు. కామెర్లెంగో పాపల్ అపార్ట్‌మెంట్‌ను తాళం వేస్తాడు. ఆ తర్వాత కామెర్లెంగో మత్స్యకారుని ఉంగరాన్ని, పోప్ ముద్రను నాశనం చేయడానికి ఏర్పాట్లు చేస్తాడు. ఇది అతని పాలన ముగింపుకు గుర్తు. పాపల్ పరివర్తనను నియంత్రించే యూనివర్సి డొమినిసి గ్రెగిస్ రాజ్యాంగం ప్రకారం పోప్ మరణించిన వారం రోజులలోపు అతని అంత్యక్రియలు జరగాలి. ఆ తర్వాత పోప్‌ను సెయింట్ పీటర్స్ బసిలికాలో ఖననం చేస్తారు. తొమ్మిది రోజుల సంతాప దినాలు ఉంటాయి.

ఇది కూడా చదవండి:టానింగ్ తొలగించుకోవడానికి సులభమైన పరిష్కారం

పోప్ మరణించిన 15 నుంచి 20 రోజుల్లో తదుపరి పోప్‌ను ఎన్నుకునే పాపల్ సమావేశం ప్రారంభమవుతుంది. 80 ఏళ్లలోపు కార్డినల్స్ దీనికోసం వాటికన్‌లో సమావేశమవుతారు. పోప్ ఎన్నిక అంతా సీక్రెట్‌గా ఉంటుంది. పోప్ ఎన్నిక సమయంలో సిస్టీన్ చాపెల్ లోపల మీటింగ్‌లో ఉన్నవారు బయట వ్యక్తులతో సంబంధం ఉండకూడదు. పోప్ అభ్యర్థికి మూడింట రెండు వంతుల మెజారిటీ ఓట్లు వచ్చే వరకు వారు బహుళ రౌండ్లలో ఓటు వేస్తారు. కొత్త పోప్ ఎన్నికైన తర్వాత ఆయన తన పాత్రను అంగీకరిస్తున్నారా అని అధికారికంగా అడుగుతారు. ఆయన అంగీకరిస్తే ఆయన ఒక పాపల్ పేరును ఎంచుకోవాలి. సీనియర్ కార్డినల్ డీకన్ సెయింట్ పీటర్స్ బసిలికా బాల్కనీలో నిలబడి లాటిన్‌లో హేబెమస్ పాపం అంటే తెలుగలో మనకు పోప్ ఉన్నాడని ప్రకటిస్తాడు. తర్వాత కొత్త పోప్ సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో తన అనుచరులను పలకరించి, పోప్‌గా తన మొదటి ఆశీర్వాదాలను అందిస్తాడు.

Also Read: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్‌ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!

Advertisment
తాజా కథనాలు