TESLA: టెస్లాకు ఎలాన్ మస్క్ టాటా గుడ్ బై..కొత్త సీఈవోగా టామ్ ఝూ?

దాంతో పాటూ ట్రంప్, మస్క్ కలిసి తీసుకుంటున్న నిర్ణయాల వలన కూడా టెస్లా షేర్లు దారుణంగా పతనమౌతున్నాయి. దీంతో ఎలాన్ మస్క్ ను సీఈవో పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ వినబడుతోంది. ఈ నేపథ్యంలో కొత్త సీఈవోగా  టామ్ జు ను నియమిస్తారని అంటున్నారు. 

New Update
tesla

tesla

టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ సృష్టి టెస్లా. ఈ కారుకు కొన్నాళ్ళ క్రితం వరకు మహా క్రేజ్ ఉంది. కానీ కొద్ద రోజులుగా టెస్లా కార్ల మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దాంతో పాటూ టప్రంప్ ప్రభుత్వంలో ఎలాన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల టెస్లా కార్ల అమ్మకాలు బాగా పడిపోయాయి. వాటికి తోడు సుంకాల నిర్ణయం ఒకటి. ఈ అన్ని కారణాల వలన టెస్లా షేర్లు మార్కెట్లో క్షీణిస్తున్నాయి. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడే టెస్లా కారు ను కొనడమే కాక తన పూర్తి మద్దతు ఉందని ప్రకటించారు. అయినా కూడా అమెరికాలో ఆ కారును కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. విదేశాలలో కూడా టెస్లా కార్ల విక్రయాలు తగ్గిపోయాయి. దాని కన్నా చైనా బీవైడీ, మరికొన్ని ఎలక్ట్రానిక్ కార్ల తక్కువ ధరకు, మంచి ఫీచర్లతో వస్తుండడంతో జనాలు వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో 2025 సంవత్సరం మొదటి త్రై మానసికంలో టెస్లా స్టాక్స్ 35శాతం పడిపోయాయి. 2022 తర్వాత ఇదే అత్యతం తీవ్ర మైన తగ్గుదల అని చెబుతున్నారు.

Also Read :  ట్రెండింగ్‌లో #Getoutmodi

ఎలాన్ సరిగ్గా చేయడం లేదు..

ఈ నేపథ్యంలో టెస్లా సీఈవోగా ఎలాన్ మస్క్ రాజీనామా చేయాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.  గెర్బర్ కవాసకి వెల్త్ మేనేజ్‌మెంట్ CEO అయిన గెర్బర్.. ట్రంప్ ప్రభుత్వంలో తన DOGE పాత్రకు మస్క్ స్పష్టంగా కట్టుబడి ఉన్నాడని అన్నారు. టెస్లాను నడపడం కంటే ట్రంప్ పరిపాలనతోనే ఆయన ఎక్కువ సమయం గడుపుతున్నారని..అందుకే టెస్లాకు కొత్త సీఈవో అవసరమని చెబుతున్నారు. వ్యాపారం చాలా కాలంగా నిర్లక్ష్యం చేయబడిందని చెప్పారు. 

Also Read :  Alekhya Chitti Pickles Issue: బలుపు ఎక్కువైంది.. అలేఖ్య చిట్టి పై యూట్యూబర్ అన్వేష్ షాకింగ్ వ్యాఖ్యలు!

టామ్ ఝూ అయితేనే కరెక్ట్..

దీంతో టెస్లా కు నెక్స్ట్ సీఈవో ఎవరనే డిస్కషన్ మొదలైంది. టెస్లా చైనా సీఈవో టామ్ ఝా అయితేనే కరెక్ట్ అంటున్నారు. ఇతనికి ఈ కంపెనీ కార్యకలాపాల మీద లోతైన జ్ఞానం ఉందని చెబుతున్నారు. చైనాలో పెరిగిన ఝూ , అమెరికా, న్యూజిలాండ్‌లో విద్యను అభ్యసించారు. డ్యూక్ విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పొందారు. 2014లో, చైనాలో టెస్లా విస్తరణ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఝా అక్కడ దానిని బాగా అభివృద్ధి చేశారు. 2019లో, ఆయన గ్రేటర్ చైనా వైస్ ప్రెసిడెంట్ పదవికి కూడా ఎంపికయ్యారు. షాంఘై గిగా ఫ్యాక్టరీని కేవలం పది నెల్లో పూర్తి చేయడంలో టామ్ కీలకపాత్ర పోషించారు. చైనాలో టెస్లా అమ్మకాలు బాగా పెరిగేలా చేశారు. అందుకే ఎలాన్ మస్క్ వారసుడిగా టామ్ ఝా అయితేనె కరెక్ట్ గా ఉంటుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. 

Also Read: Ukraine: పేరుకే అగ్రరాజ్యం..చేసేవన్నీ బలహీనమైన పనులే..అమెరికాపై జెలెన్ స్కీ విమర్శలు

Also Read :  Musk: యూఎస్‌-యూరప్‌ ల మధ్య సుంకాలుండవు.. మస్క్‌ సంచలన వ్యాఖ్యలు!

 

elon-musk | tesla | usa | today-latest-news-in-telugu | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu | telugu breaking news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు