/rtv/media/media_files/2025/11/28/hong-kong-fire-deaths-rise-to-128-2025-11-28-14-50-20.jpg)
Hong Kong Fire Deaths Rise To 128
హంకాంగ్(hongkong)లో జరిగిన అగ్నిప్రమాదం(fire accident)లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్ 36న ఏడు బహుళ అంతస్తుల బిల్డింగ్స్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో ఇప్పటిదాకా 128 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 200 మందికి పైగా ఇంకా ఆచూకీ దొరకలేదని పేర్కొన్నారు. ఈ ఘోర అగ్నిప్రమాదం జరిగిన అనంతరం ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పేశారు.
Also Read: దారుణంగా దేశ రాజధాని..సివియర్ ఎయిర్ పొల్యూషన్ తో నరకం
Fire Accident In Hong Kong
ఈ క్రమంలోనే ఒక్కో బిల్డింగ్‌ను తనిఖీ చేస్తుండటంతో మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకున్న ఈ ప్రమాదం కొన్ని క్షణాల్లోనే ఇతర అపార్ట్‌మెంట్‌లకు వ్యాపించాయి. ఈ మంటలు ఆర్పేందుకు దాదాపు 1000 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ భవనాల మరమ్మతులు చేపట్టిన నేపథ్యంలో కిటికీల వదద్ పాలిస్టరైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మంటల తీవ్రత పెరిగినట్లు అధికారులు అంటున్నారు. ఆ బిల్డింగుల మరమ్మతుల కోసం ఏర్పాటు చేసిన వెదురు బొంగులు, నిర్మాణ మెష్ కూడా మంటల తీవ్రత పెరిగేందుకు కారణమై ఉంటాయని భావిస్తున్నారు.
Also Read: భారత్‌కు పుతిన్.. షెడ్యూల్ ఖరారు
ఈ అగ్నిప్రమాదం జరిగిన హౌసింగ్ కాంప్లెక్స్‌ను 1983లో తై పో అనే జిల్లాలో నిర్మించారు. ఇందులో 8 టవర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా దగ్గరగా 31 అంతస్తుల్లో ఉన్నాయి. మొత్తం 1984 ఫ్లాట్లు ఉన్నాయి. దాదాపు 4600 మంది ఈ అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్నారని అధికారులు చెప్పారు. మరో విషయం ఏంటంటే ఇక్కడ 40 శాతనికి పైగా 65 ఏళ్లు పైబడిన వారే ఉన్నట్లు సమాచారం. అయితే ఈ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళన రేపుతోంది. మరోవైపు క్షతగాత్రలకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.
Follow Us