Hongkong: 77 ఏళ్ళల్లో అతి పెద్ద అగ్ని ప్రమాదం..కృత్రిమ వానకూ ఆరని మంటలు

చైనాలో హాంకాంగ్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగుల్చింది. 48 గంటలు గడుస్తున్నా మంటలు పూర్తిగా ఆరలేదు. కృత్రిమ వర్షం, గన్ పౌడర్ లాంటివి ఏవీ వాటిని నియంత్రించలేకపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 94 మంది మృతి చెందారు.

New Update
hongkong

హాంకాంగ్ అగ్ని ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 94 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 76 మంది తీవ్రగా గాయపడ్డారు. మరో 280 మంది ఆచూకీ లభించడం లేదు. 48 గంటలు గడిచాయి..304 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయినా కూడా ఇంకా మంటలు అదుపులోకి రావడం లేదు. మంటలను అదుపులోకి తీసుకుని వచ్చేందుకు 5జీ, గన్ పౌడర్, ఏఐ, ఫ్లైయింగ్ కార్స్, కృత్రిమ వర్షం లాంటి అధునాతన పద్ధతులను ఉపయోగించారు. కానీ ఏమీ ఫలితం లేకపోయింది. 77 ఏళ్ళల్లో చైనాలో ఇదే అత్యంత ఘోరమైన అగ్ని ప్రమాదం అని చెబుతున్నారు. వందలాది ఆవిష్కరణలను కనిపెట్టిన చైనానే మంటలను నియంత్రించడంలో ఫెయిల్ అయింది.

మంటలు ఆగపోవడానికి కారణం ఏంటి?

చైనాలోని వాంగ్ఫక్ కోర్టు కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం జరిగిన చోట మొత్తం ఎనిమిది భవనాలున్నాయి. ఇది తాయ్ పో జిల్లాలో ఒక పెద్ద గృహ సముదాయం. ఆ నివాస సముదాయంలో మొత్తం 2వేల ఇళ్ళు ఉన్నాయి. వాటిల్లో కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మొత్తం 7 అపార్ట్‌మెంట్లలో 4,800 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో ఒక భవనంలో ప్రస్తుతం మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. దీని కారణంగా అన్ని టవర్లు వెదురు స్కాఫోల్డింగ్ తో కప్పి ఉంచారు. ఏడు అపార్ట్ మెంట్లలోనిఒక్కోదానిలో 35 అంతస్తులు ఉన్నాయి. ఈ మరమ్మత్తులు కారణంగా మంటలు కూడా అంటుకున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ కూడా చేశారు. అయితే భవనాల వెలుపల ఉణ్న వెదురు స్కాఫోల్డింగ్ ద్వారా మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. దానికి తోడు బలమైన గాలులు అగ్నికి ఆజ్యం పోశాయి. దీంతో అత్యంత వేగంగా మంటలు ఒక భవనం నుంచి మరోక భవనానికి వ్యాపించాయి. పునరుద్ధరణ పనుల కారణంగా అందరూ తమ ఇంటి కిటికీలను మూసి ఉంచారు. దీంతో మంటలు చెలరేగిన విషయం చాలా మంది నివాసితులకు తెలియలేదు. తెలిసే సరికి అందులో చిక్కుకుపోయారు.

ఉష్ఱోగ్రతలు చాలా ఎక్కువగా ఉండి..

ఇక మంటలను ఆర్పడానికి వచ్చిన అగ్ని మాపక సిబ్బంది కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దాదాపు 300మంది సిబ్బంది రెండు రోజులుగా కష్టపడుతున్నారు. అయితే వారు అక్కడ చాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండడంతో బాధితుల దగ్గరకు చేరుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఒక సిబ్బంది మరణించారు కూడా. ఈ కారణంగా ఇప్పటికీ చాలా మంది ఆ భవనాల్లో చిక్కుకున్నారని తెలుస్తోంది. 300 మంది ఆచూకీ దొరకడం లేదు.

తీవ్ర విమర్శలు..

ఈ అగ్ని ప్రమాదం తర్వాత చైనా చాలా విమర్శలను ఎదుర్కోంటోంది. ఎగిరే కార్లను, 6జీ, ఏఐ టెక్నాలజీని కనిపెట్టిన చైనా అధునాతన సాంకేతిక మంటలను ఎలా ఆర్పాలోచెప్పలేకపోయిందని అంటున్నారు. చైనా పునరుత్పాదక ఇంధనం , విద్యుత్ వాహనాలలో పెట్టుబడి పెట్టింది, కానీ అగ్ని నిరోధక పదార్థాల వంటి ప్రాథమిక భద్రతా చర్యలను విస్మరించిందని విమర్శిస్తున్నారు.

మండే పదార్థాలు: 

జూలై 2024 తర్వాత నిర్మించిన ఈ భవనాలు వెదురు, ఆకుపచ్చ మెష్‌తో కప్పబడి ఉన్నాయి. ఇది చైనాలో ముఖ్యంగా హాంకాంగ్‌లో సాధారణమైన సాంకేతికత. ఈ స్కాఫోల్డింగ్ ఉక్కు స్కాఫోల్డింగ్‌కు ప్రత్యామ్నాయం. ఇది నిర్మాణంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఎందుకంటే ఇది తేలికగా ఉండడమే కాకుండా చాలా బలంగా ఉంటుంది. దీనిని రవాణా చేయడం, ఎత్తులకు పెంచడం సులభం. పొడవైన వెదురు స్తంభాలను సులభంగా అటాచ్ చేయవచ్చు. ఈ స్కోఫోల్డ్ ను పెద్ద భవనాల చుట్టూ త్వరగా నిర్మించడం సాధ్యమవుతుంది. అయితే, ఎలివేటర్ కిటికీలపై ఏర్పాటు చేసిన స్టైరోఫోన్ బ్లాక్‌లు మంటలు వేగంగా వ్యాపించడానికి అనుమతించాయి. మంటలు బయట ప్రారంభమయ్యాయి కానీ కారిడార్ల ద్వారా అపార్ట్‌మెంట్‌లకు వ్యాపించాయి.

నిర్మాణ నిర్లక్ష్యం:

తీవ్ర నిర్లక్ష్యానికి కారణమైన నిర్మాణ సంస్థ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. మండే పదార్థాల వాడకం భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గృహాల నిర్మాణంపై హాంకాంగ్‌లో అధిక నిబంధనలు ఉన్నాయి. కానీ పునరుద్ధరణల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 

స్మార్ట్ సిస్టమ్స్ లేకపోవడం:

ఆధునిక భవనాల్లో AI- ఆధారిత పొగ డిటెక్టర్లు, ఆటోమేటిక్ స్ప్రింక్లర్లు, అలారాలు ఉంటాయి. ఇవి మంటలు వ్యాపించకుండా 50-70% నిరోధించగలవు. అయితే ప్రస్తుతం మంటలు అంటుకున్న భవనాలు చాలా పాత కాంప్లెక్స్, ఇక్కడ అటువంటి సాంకేతికత లు ఎక్కువగా లేవు.

డ్రోన్లు, రోబోల కొరత:

చైనా వద్ద అధునాతన అగ్నిమాపక రోబోలు, డ్రోన్లు ఉన్నాయి. కానీ జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాటి విస్తరణ ఆలస్యం అయింది. ఫలితంగా, అగ్నిమాపక సిబ్బంది ప్రమాదంలో పడ్డారు.

Advertisment
తాజా కథనాలు