AP Rain Alert : దూసుకొస్తున్న మరో అల్పపీడనం || High Alert To AP || AP Rains || Weather Report || RTV
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్ననేపథ్యంలో రాష్ట్రంలో కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారగా.. ప్రస్తుతం ఆ వాయుగుండం బలహీనపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాలలో వానలు కురుస్తున్నాయి. శుక్రవారం కూడా ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది.