Canada Theatre Halts Screening: పవన్‌ కళ్యాణ్, రిషబ్‌ షెట్టికి షాక్.. ఆ దేశంలో సౌత్ ఇండియన్ సినిమాలు నిలిపివేత

సౌత్ ఇండియన్ సినిమాలకు బిగ్ షాక్ తగిలింది. కెనడాలో భారతీయ చిత్రాల ప్రదర్శను ఆపేశారు. తాజాగా వచ్చిన పవన్‌ కళ్యాణ్ నటించిన ఓజీ, రిషబ్‌ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 తో పాటు పలు చిత్రాల షోలను రద్దు చేశారు.

New Update
Canada Theatre Halts Screening Of Indian Films After Arson Attempt, Shooting

Canada Theatre Halts Screening Of Indian Films After Arson Attempt, Shooting

సౌత్ ఇండియన్ సినిమా(South Indian Films) లకు బిగ్ షాక్ తగిలింది. కెనడాలో భారతీయ చిత్రాల ప్రదర్శను ఆపేశారు. తాజాగా వచ్చిన పవన్‌ కళ్యాణ్ నటించిన ఓజీ(og), రిషబ్‌ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1) తో పాటు పలు చిత్రాల షోలను రద్దు చేశారు. ఇటీవల అక్కడ ఓ థియేటర్‌లో జరిగిన కాల్పుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఒంటారియో ప్రావిన్సులోని ఓ థియేటర్‌పై గత 7 రోజుల్లో రెండుసార్లు దాడులు జరిగాయి. 

Also Read: 10 పాక్‌ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాం.. ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌ మార్షల్ సంచలన వ్యాఖ్యలు

Canada Theatre Halts Screening Of Indian Films

సెప్టెంబర్ 25న తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు ముసుగులో థియేటర్‌ వద్దకు వచ్చారు. అక్కడ ఎంట్రెన్స్ వద్ద లిక్విడ్‌ చల్లేసి చిన్నపాటి పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో థియేటర్‌ బయటి భాగం కాస్త దెబ్బతింది. అక్టోబర్ 2న కూడా ముసుగులో వచ్చిన ఓ వ్యక్తి కూడా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో థియేటర్‌ సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.  అయితే కెనడాలో భారతీయ చిత్రాలు.. ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాల ప్రదర్శనే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నట్లు అక్కడున్న థియేటర్ల నిర్వహకులు భావిస్తున్నారు. 

దీంతో అక్కడ ఆన్‌లైన్ బుకింగ్ జాబితాల నుంచి పలు భారతీయ సినిమాలను తొలగించారు.  ఓక్‌విల్లేలోని ఫిల్మ్‌.సీఏ సినిమాస్‌ ఓజీ, కాంతార చాప్టర్ 1 చిత్రాల షోలను మాత్రమే తాము నిలిపివేస్తున్నామని పేర్కొంది. రిచ్‌మండ్ హిల్‌లోని యార్క్‌ సినిమాస్‌ కూడా పలు భారతీయ సినిమాల షోలను రద్దు చేసింది. తమ థియేటర్‌లో పనిచేసే సిబ్బంది, అలాగే ప్రేక్షకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వాళ్ల డబ్బులు కూడా రిఫండ్ చేస్తామని చెప్పింది. గ్రేటర్ టోరంబో ప్రాంతంలో కూడా పలు థియేటర్లలో భారతీయ చిత్రాల ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది.  అల్బర్టా, క్యూబెక్, మానిటోబా,  బ్రిటిష్ కొలంబియా, ప్రావిన్స్‌లో ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. 

Also Read: వెళ్ళిపోండి..లేకుంటే తీవ్రవాదులుగా పరిగణన..గాజా ప్రజలకు ఇజ్రాయెల్ చివరి హెచ్చరిక

థియేటర్లపై దాడులు చేయడం ఖలీస్తానీయుల పని అయి ఉంటుందని ప్రచారం నడుస్తోంది. గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగినట్లు అక్కడివారు చెబుతున్నారు. అందుకే ఈసారి కూడా ఖలీస్తానీయుల దాడి చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పోలీసులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు థియేటర్లలలో జరుగుతున్న దాడులకు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే తమను సంప్రదించాలని అక్కడున్న అధికారులు ప్రజలను కోరుతున్నారు. 

Also Read: విదేశీ విద్యార్థులపై మరో బాంబ్..ప్రవేశాలపై వైట్ హౌస్ కీలక ఆదేశాలు

Advertisment
తాజా కథనాలు