Israel Warning: వెళ్ళిపోండి..లేకుంటే తీవ్రవాదులుగా పరిగణన..గాజా ప్రజలకు ఇజ్రాయెల్ చివరి హెచ్చరిక

పాలస్తీనియన్లు వెంటనే గాజాను వదిలేసి వెళ్ళిపోవాలని...లేకపోతే తీవ్రవాదులుగా పరిగణిస్తామని ఇజ్రాయెల్ తన చివరి హెచ్చరికు జారీ చేసింది.  ఇప్పుడు గాజా నగరాన్ని వదిలి వెళ్లే వారు ఇజ్రాయిల్ సైనిక పోస్టుల గుండా వెళ్లాలని చెప్పింది. 

New Update
israel

రెండేళ్ళ నుంచి గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. తాజాగా వీటిని మరింత ఉధృతం చేసింది. ఐడీఎఫ్ ఆ నగరాన్ని చుట్టుముట్టింది. బుధవారం తీవ్ర దాడులతో మరోసారి గాజాపై విరుచుకుపడింది ఐడీఎఫ్. దీని కారణంగా గాజా నగరాన్ని వదిలేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ రక్ణ మంత్రి కాట్జ్ అక్కడి ప్రజలను హెచ్చరించారు. ఇదే తమ చివరి హెచ్చరిక అని తెలిపారు. అలా వెళ్ళకుండా ఉండిపోయిన వారిని తీవ్రవాదులుగానే పరిగణిస్తామని తెలిపారు. గాజా స్ట్రిప్ ఉత్తర భాగంలో ఉన్న వారు దక్షిణ భాగానికి వెళ్లిపోవాలని చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే నెట్‌జారిమ్ కారిడార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కాట్జ్ చెప్పారు. ఇప్పుడు గాజా నగరాన్ని వదిలి వెళ్లే వారు ఇజ్రాయిల్ సైనిక పోస్టుల గుండా వెళ్లాల్సి వస్తుందని కాట్జ్ తెలిపారు. 

ఒక్క రోజులో 46 మంది..

బుధవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో 46 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 66 వేలకు చేరుకుందని పాలస్తీనా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటకే గాజాలో మనవతా సహాయం అంతంత మాత్రంగా ఉంది. దానికి తోడు తాజా దాడులతో రెడ్ క్రాస్ గాజా నగరంలో కార్యకలాపాలను నిలిపేసినట్లు తెలిపింది. ఇటువంటి పరిస్థితుల్లో పాలస్తీనియన్లు హమాస్ ను వదిలేసి దక్షిణ గాజాకు వెళ్ళిపోవడమే మంచిదని చెబుతున్నారు. 

మరోవైపు యుద్ధ ముగింపుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 21 శాంతి సూత్రాలను హమాస్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు సంబంధించి వారు సవరణలు కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక తాను రూపొందించిన 21 శాంతి సూత్రాల ప్రణాళికకు తొందరగా అంగీకారం తెలపాలని...లేకపోతే తవ్ర పరిణామలను ఎదుర్కోవలసి వస్తుందని అధ్యక్షుడు ట్రంప్ హమాస్ ను హెచ్చరించారు.  ఒప్పందానికి అంగీకరించకుంటే ముగింపు విషాదంగా ఉంటుందని అన్నారు. ట్రంప్ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్ తో సహా భాగస్వామ్య పక్షాలన్నీ అంగీకరించాయి. ముస్లిం దేశాలు కూడా ఒకే అన్నాయి. ఇప్పుడు హమాస్ ఒక్కటే అంగీకారం తెలపాలి. మూడు, నాలుగు రోజులు వెయిట్ చేస్తామని...లేకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని ట్రంప్ చెబుతున్నారు. అప్పుడు ఇజ్రాయెల్ ను ఆపడం ఎవరి తరం కాదని..అదే చేయాలో చేస్తుందని చెప్పారు. ట్రంప్ హెచ్చరిక ప్రకారం హమాస్ నాలుగు రోజుల్లో తమ నిర్ణయాన్ని తెలపాలి. లేకుంటే ఇజ్రాయెల్ గాజాను పూర్తిగా నాశనం చేస్తుంది. అందుకు అక్కడి ప్రజలు ఎంత తొందరగా అక్కడి నుంచి అంత మంచిదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ హెచ్చరించారు. 

Also Read: Zubeen Garg: నా భర్తను బలవంతంగా నీళ్ళల్లోకి తీసుకెళ్ళారు..సింగర్ జుబీన్ గార్గ్ భార్య..మరో ఇద్దరి అరెస్ట్

Advertisment
తాజా కథనాలు