Marshal: 10 పాక్‌ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాం.. ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌ మార్షల్ సంచలన వ్యాఖ్యలు

భారత వాయుసేన (IAF) చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‌’లో పాకిస్తాన్‌కు చెందిన 10 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఎ.పి సింగ్ అన్నారు. అందులో ఐదు F-16 , మరో ఐదు JF-17 ఫైటర్ జెట్లు ఉన్నాయని తెలిపారు.

New Update
Air Chief Marshal AP Singh

Air Chief Marshal AP Singh

భారత వాయుసేన (IAF) చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‌’లో పాకిస్తాన్‌కు చెందిన 10 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఎ.పి సింగ్ అన్నారు. అందులో ఐదు F-16 , మరో ఐదు JF-17 ఫైటర్ జెట్లు ఉన్నాయని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లకు నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌ విజయవంతం కావడానికి గల కారణాలను, పోరాట వివరాలను తెలియజేశారు. "గాల్లోనే 5 ఫైటర్ జెట్లు ధ్వంసమైనట్లు మా వద్ద ధృవీకరించబడిన ఆధారాలు ఉన్నాయి. దీంతో పాటు, సుమారు 300 కిలోమీటర్ల దూరం నుంచి ఒక పెద్ద నిఘా విమానాన్ని కూడా నేలకూల్చాం. ఉపరితలం నుంచి గాల్లోకి దూసుకెళ్లి ఇంతటి దూరంలో విమానాన్ని కూల్చడం చరిత్రలోనే ఇదే అతి పెద్ద సంఘటన.

Also Read: లద్దాఖ్ అల్లర్లలో ఇతనిదే కీలక పాత్ర.. కేంద్రం స్పెషల్ ఫోకస్!

Air Chief Marshal AP Singh Key Comments

గాల్లో కూల్చిన ఆరు విమానాలతో పాటు, వైమానిక స్థావరాలపై జరిగిన దాడుల్లో మరో నాలుగు విమానాలు నేల మీద ధ్వంసమయ్యాయి. షాబాజ్ జాకోబాబాద్ ఎయిర్‌ఫీల్డ్‌లోని F-16 హ్యాంగర్‌లలో కొన్ని విమానాలు, మరొక AEW&C విమానం బోలారి వైమానిక స్థావరంలోని హ్యాంగర్‌లో ఉన్నప్పుడు దాడులకు గురై ధ్వంసమయ్యాయి. భవిష్యత్తు సవాళ్లను అధిగమించేందుకు రక్షణరంగంలో ‘సుదర్శన చక్ర’ను తయారుచేస్తున్నామని'' ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ వివరించారు. ధ్వంసమైన విమానాలలో అమెరికా తయారీ F-16లు, చైనా-పాక్ సంయుక్త JF-17లు ఉన్నట్లు సమాచారం.

Also Read: పాకిస్తాన్ లో మళ్ళీ బాంబు పేలుడు..తొమ్మిది మంది మృతి

ఈ ఆపరేషన్‌లో ఇటీవల భారత్ సమకూర్చుకున్న ఎస్-400 (S-400) ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని వాయుసేనాని కొనియాడారు. ఈ వ్యవస్థ పరిధి కారణంగా పాకిస్తాన్ విమానాలు తమ ఆయుధాలను ఉపయోగించలేకపోయాయని, దీంతో భారత దళాలకు గాల్లో పూర్తి ఆధిపత్యం లభించిందని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటానికి రాజకీయ నాయకత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం కూడా ఈ విజయానికి ప్రధాన కారణమని సింగ్ పేర్కొన్నారు. ఈ దాడుల తీవ్రత కారణంగానే, ఘర్షణ కొనసాగితే పాకిస్తాన్ మరింత నష్టపోతుందని గ్రహించి కాల్పుల విరమణ కోరిందని ఆయన వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు