Kantara 2 Actor: కాంతార' షూటింగ్ లో నటుడి దుర్మరణం!
రిషబ్ శెట్టి 'కాంతార' షూటింగ్ సెట్ లో పెను విషాదం చోటుచేసుకుంది. జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఈత కోసం నదిలో దూకిన కపిల్ సుడిగుండంలో చిక్కుకొని చనిపోయినట్లు సమాచారం.