/rtv/media/media_files/2025/08/31/white-house-clarifies-2025-08-31-08-21-30.jpg)
విదేశీ విద్యార్థుల అడ్మిషన్ల విషయంలో ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు పరిమితులను విధించారు. దీనికి సంబంధించి అమెరికాలో అన్ని యూనివర్శిటీలకు మెమోలను జారీ చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు కావాలంటే విదేశీ విద్యార్థుల ప్రవేశాలను తగ్గించాలని చెప్పారు. పరిమిత సంఖ్యలోనే విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది వౌట్ హౌస్. దాంతో పాటూ జాతి, లింగ ఆధారిత ప్రవేశాలు నిలిపివేయాలని...అడ్మిషన్ సమయంలో విద్యార్థులకు కచ్చితంగా ప్రామాణిక పరీక్ష నిర్వహించాలని చెప్పింది. అలాగే విదేశీ వీసాలపై వచ్చే విద్యార్థుల సంఖ్య 15 శాతానికి మించి ఉండకూడదు. ఒకే దేశం నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్య 5 శాతానికి మించకూడదని రూల్స్ పెట్టింది. వీటన్నింటికీ కట్టుబడి ఉంటేనే ప్రభుత్వం నుంచి నిధులు అందుతాయని తేల్చి చెప్పింది.
రూల్స్ పాటించకపోతే డబ్బులు ఇవ్వం..
గవర్నమెంట్ వచ్చే నిధుల ద్వారా విద్యార్థులకు ప్రభుత్వ రుణాలు, గ్రాంట్లు, కాంట్రాక్టులు, రిసెర్చి నిధులు, విదేశీ పరిశోధకులకు వీసా అనుమతులు, పన్ను మినహాయింపులో ప్రాధాన్యం వంటివి పొందవచ్చని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అలాగే విదేశాల నుంచి యూనివర్శిటీలకు అందే గ్రాంట్లను బహిర్గతం చేయాలని వైట్ హౌస్ చెప్పింది. అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తుదారులు కచ్చితంగా SAT లేదా ACT వంటి ప్రామాణిక పరీక్షను పూర్తిచేయాల్సిందేనని..విద్యాస్వేచ్ఛను కాపాడే విధానాలను అమలు చేయాలని ఆదేశించింది. అలాగే పాఠ్యాంశాల్లో సంప్రదాయవాద ఆలోచన సరళిని ఇబ్బందిపెట్టే, దాడులకు పాల్పడే యూనిట్స్‌ను తొలగించాలని ఆదేశించింది. విద్యాలయాలను ఇబ్బందిపెట్టేలా రాజకీయ ప్రదర్శనలు, విద్యార్థులను లేదా గ్రూపులను వేధించకుండా చర్యలు చేపట్టాలి. ఉద్యోగులు అధికారిక విధుల సమయంలో రాజకీయ ప్రసంగాలు, చర్యలకు దూరంగా ఉండాలి. బాత్‌రూమ్‌లు, లాకర్ రూమ్‌లు లింగ ఆధారంగా వేర్వేరుగా ఉండాలి. హార్డ్‌సైన్స్ విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉచిత ట్యూషన్ ఫీజ్, ప్రోత్సాహకం కింద 2 మిలియన్ డాలర్లు మించి ఇవ్వాలని వౌట్ హౌస ప్రతిపాదించింది. ఈ రూల్స్ అన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని...జస్టిస్ డిమార్ట్ మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ తెలుసుకుంటుందని తెలిపింది. ఎప్పుడైనా ఈ రూల్స్ ను అతిక్రమిస్తే రెండేళ్ళపాటూ గవర్నమెంట్ గ్రాంట్ ను ఆపేస్తారు.
Also Read: Putin Warning: భారత్ ను అవమానిస్తే ఒప్పుకునేది లేదు..యూఎస్ కు పుతిన్ వార్నింగ్