Pahalgam Terror Attack : జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడ్డారు. పర్యాటకుల మతం తెలుసుకుని మరీ కాల్చేశారు. మొత్తం 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు తీశారు. దీంతో భారత్ తీవ్ర నిర్ణయాన్ని తీసుకుంది. ముందెన్నడూ ఊహించని విధంగా మెరుపుదాడులకు దిగింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్ర శిబిరాలపై దాడులు చేపట్టింది. దీంతో పాకిస్థాన్ బెంబెలెత్తిపోతుంది. ఈ క్రమంలోనే జీ 7 దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి.
ఇది కూడా చూడండి: IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!
భారత్ నుంచి ఇంతటి తిరుగుబాటు వస్తుందని ఊహించని పాక్ ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటోంది. భారత్ యుద్ధం ప్రకటించటంతో పాక్ చుక్కలు చూస్తోంది. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌కు మద్దతు ఇవ్వడానికి ఏ దేశం ఆసక్తి చూపటం లేదు. అమెరికా వంటి అగ్రరాజ్యాలు కూడా ఈ విషయంలో కలుగ జేసుకోవడానికి నిరాకరించాయి. ఈ క్రమంలోనే పాక్ కు మరో షాక్ ఇస్తూ జీ 7 దేశాలు కీలక ప్రకటన చేశాయి.పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు అమెరికా, కనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మన్, ఇటలీ దేశాలు ఈ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రకటనతో పాకిస్థాన్ విధానాన్ని వ్యతిరేకించడమే కాకుండా భారత్‌కు మద్ధతునిచ్చిట్లయింది.
ఇది కూడా చూడండి:BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్
జీ7 దేశాలు పాకిస్థాన్ తీరును తప్పు పట్టడంతో పాటు యుద్ధం విషయంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని సూచించాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రాంతీయ స్థిరత్వంపై భారీ దెబ్బ పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. తాము ఇరు దేశాల ప్రజల క్షేమం గురించి ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. రెండు దేశాలు వీలైనంత త్వరగా యుద్ధాన్ని ఆపాలని, కూర్చుని శాంతియుతంగా చర్చించుకునే ప్రయత్నం చేయాలని కోరాయి.
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!