Karnataka: ముచ్చటగా మూడు పెళ్లిళ్లు.. సైలెంట్ గా లేపేసిన మూడో భార్య!
ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుని చివరికి మూడో భార్య చేతిలోనే హతమయ్యాడు ఓ వ్యక్తి. కర్నాటక లోని ముండగోడ జిల్లాకు చెందిన మంజునాథ్ జాదవ్ మొదటి భార్య చాలా సంవత్సరాల క్రితం మరణించింది.
ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుని చివరికి మూడో భార్య చేతిలోనే హతమయ్యాడు ఓ వ్యక్తి. కర్నాటక లోని ముండగోడ జిల్లాకు చెందిన మంజునాథ్ జాదవ్ మొదటి భార్య చాలా సంవత్సరాల క్రితం మరణించింది.
పంజాబ్‌లో పార్కింగ్ పంచాయతీ యంగ్ సైంటిస్ట్ ప్రాణం తీసింది. మొహాలీలో కుటుంబంతో కలిసి అభిషేక్ అద్దెకు ఉంటున్నాడు. పార్కింగ్ విషయంలో పక్కింటి వ్యక్తితో గొడవ జరగ్గా అభిషేక్‌పై దాడికి పాల్పడగా అభిషేక్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి మద్యంలో పురుగులమందు కలిపి భర్తను అంతమొందించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసిన ఘటన వివరాలను పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
ఢిల్లీలోని ఓ హోటల్లో బ్రిటిష్ మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలపై ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి నిందితుడితో ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడగా.. అతని కోసం ఢిల్లీకి వచ్చింది. బాధితురాలు పోలీసులను సంప్రదించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
లిథువేనియ దేశానికి చెందిన బెస్సియోకోవ్ అమెరికా మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ లిస్ట్‌లో ఉన్నాడు. ఆర్థికనేరాలకు పాల్పడి 96 బిలియన్ డాలర్ల స్కాం చేసినట్లు అమెరికా పోలీసులు ఆరోపిస్తున్నారు. అతన్ని కేరళా పోలీసులు బుధవారం తిరువనంతపురంలో అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ నగరం పరిధిలోని ముషీరాబాద్‌లో బుధవారం రాత్రి భారీ పేలుడు జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాంలో భారీ పేలుడు సంభవించడంతో బీహార్‌కు చెందిన ఇసాక్ అహ్మద్(28) అనే వ్యక్తి కి తీవ్ర గాయాలయ్యాయి.
విశాఖ స్టీల్ సిటీ వద్ద రోడ్డు ప్రమాద ఘటన జరిగింది. అనకాపల్లి నుంచి కూర్మన్నపాలెం బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా.. వీరి ద్విచక్రవాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తాగిన మైకంలో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. తమ్ముడి భార్య అని కూడా చూడకుండా కర్రతో చితకబాదాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో చోటుచేసుకుంది. మహిళపై దాడి చేసినందుకు గానూ కానిస్టేబుల్ పై కేసు నమోదు అయింది.
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బద్నావర్-ఉజ్జయిని రోడ్డులోని బామన్సుత గ్రామ సమీపంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.