యంగ్ సైంటిస్ట్ ప్రాణం తీసిన పార్కింగ్ పంచాయతీ.. అసలేమైందంటే?

పంజాబ్‌లో పార్కింగ్ పంచాయతీ యంగ్ సైంటిస్ట్ ప్రాణం తీసింది. మొహాలీలో కుటుంబంతో కలిసి అభిషేక్ అద్దెకు ఉంటున్నాడు. పార్కింగ్ విషయంలో పక్కింటి వ్యక్తితో గొడవ జరగ్గా అభిషేక్‌పై దాడికి పాల్పడగా అభిషేక్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
Parking Issue

Parking Issue Photograph: (Parking Issue)

పార్కింగ్ పంచాయతీ ఓ యంగ్ సైంటిస్ట్ ప్రాణం తీసిన ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‎కు చెందిన డాక్టర్ అభిషేక్ సర్ణకార్(39) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్‎గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మొహాలీలోని సెక్టార్ 67లో తన కుటుంబంతో కలిసి అభిషేక్‌ అద్దెకు ఉంటున్నాడు.

ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశివారు కష్టపడి పని చేస్తే విజయం మీదే!

ఇది కూడా చూడండి: Train Hijack: రైలు హైజాక్‌ ..ఆపరేషన్‌ సక్సెస్‌ అంటున్న పాక్‌ ఆర్మీ!

ఆగ్రహానికి గురై ఒక్కసారి దాడి చేయడంతో..

ఈ క్రమంలో  మంగళవారం (మార్చి 11) రాత్రి బండి పార్కింగ్ విషయంలో అభిషేక్‎కు, పొరుగింట్లో ఉండే మాంటీ అనే వ్యక్తికి మధ్య గొడవ జరిగింది. ఈ వివాదం మరింత ముదిరి ఘర్షణకు దారి తీసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మాంటీ ఒక్కసారిగా అభిషేక్‎పై దాడి చేశాడు. పిడి గుద్దులు కురిపిస్తూ విచక్షణ రహితంగా దాడి చేశాడు. మాంటీ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అభిషేక్ నేలకూలాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అభిషేక్‎ను ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: బిగ్ షాక్‌ ..హైదరాబాద్లో రేపు వైన్ షాపులు బంద్ !

తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించే లోపే అభిషేక్ మృతి చెందాడు. సైంటిస్ట్ అభిషేక్‎కు ఇటీవలే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. ఇంకా పూర్తిగా కోలుకోకముందే మాంటీ విచక్షణరహితంగా దాడి చేయడంతో అభిషేక్ మరణించాడు. దీంతో అభిషేక్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అభిషేక్‌పై మాంటీ ప్రవర్తించిన తీరు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. మాంటీపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.  

ఇది కూడా చూడండి: గుడ్ న్యూస్ ..త్వరలో తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు