/rtv/media/media_files/2025/03/13/oiMlE4w0GpOATIJR8gv6.jpg)
ముచ్చటగా మూడు పెళ్లిళ్లు (Marriages) చేసుకుని చివరికి మూడో భార్య చేతిలోనే హతమయ్యాడు ఓ వ్యక్తి. ఇంతకీ ఏం జరిగిందంటే .. కర్నాటక (Karnataka) లోని ముండగోడ జిల్లాకు చెందిన మంజునాథ్ జాదవ్ మొదటి భార్య చాలా సంవత్సరాల క్రితం మరణించింది. దీంతో అతను మరో మహిళను వివాహం చేసుకున్నాడు. రెండో వివాహం తర్వాత కూడా మంజునాథ్ .. మధు అనే మహిళతో అక్రమ సంబంధం (Illegal Affair) పెట్టుకున్నాడు. అయితే తనను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనని సదరు మహిళ పట్టుబట్టడంతో మంజునాథ్‌ను ఆమెను రహస్యంగా వివాహం చేసుకున్నారు. హుబ్బళ్లిలోని నవనగర్‌లో ఆమెతో కలిసి కాపురం కూడా పెట్టాడు. ఆమె కోసం 3 ఎకరాల భూమిని అమ్మేసి ఇల్లు కట్టించాడు.
Also Read : యంగ్ సైంటిస్ట్ ప్రాణం తీసిన పార్కింగ్ పంచాయతీ.. అసలేమైందంటే?
Also Read : పెరుగన్నంతో పేగుల్లో పేరుకున్న బ్యాక్టీరియా పరార్
వీరయ్యతో పెళ్లి.. మంజునాథ్ తొ గొడవలు
అయితే కుటుంబంలో పరిస్థితులు సరిగ్గా లేవని నమ్మి ఆమె మంజునాథ్‌ను విడిచిపెట్టి, వీరయ్య అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు వీరిద్దరి మధ్య మొదలయ్యాయి. మంజునాథ్ ఆమెకు కట్టించిన ఇల్లును తిరిగి అగడంతో అతన్ని చంపి రెండవ భర్తతో సంతోషంగా ఉండాలని మధు స్కెచ్ వేసింది. పథకం ప్రకారం, హుబ్బళ్లిలోని నవనగర్‌లో మధు నివసించే ఇంట్లో మంజునాథ్‌ను హత్య చేసి, ఆపై మృతదేహాన్ని బులెరో వ్యాన్‌లో తీసుకువచ్చి బంకాపూర్ సమీపంలో పడేసింది. అనుమానం రాకుండా ఉండటానికి, అతను బైక్ ప్రమాదంలో చనిపోయినట్లుగా నమ్మించడానికి అక్కడే బైక్ ను కూడా వదిలేసి వెళ్లింది. అయితే తన తండ్రిని ఎవరో చంపేశారంటూ మంజునాథ్ కుమారుడు విజయ్ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై బంకాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి నిందితురాలు మధును అదుపులోకి తీసుకున్నారు.
Also read : The Woman in the Yard: ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..
Also read : ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!