ఏం మనిషివిరా.. ఫుల్ గా తాగి తమ్ముడి భార్యపై.. రెచ్చిపోయిన కానిస్టేబుల్!

తాగిన మైకంలో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. తమ్ముడి భార్య అని కూడా చూడకుండా కర్రతో చితకబాదాడు. ఈ ఘటన  కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో చోటుచేసుకుంది. మహిళపై దాడి చేసినందుకు గానూ కానిస్టేబుల్ పై కేసు నమోదు అయింది.

New Update
ar constable

తాగిన మైకంలో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. తమ్ముడి భార్య అని కూడా చూడకుండా కర్రతో చితకబాదాడు. ఈ ఘటన  కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  ఆస్తి పంపకాల విషయంలో ఏఆర్ కానిస్టేబుల్ సంతోష్ కు అతని సోదరుడు వేణుతో తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా సంతోష్ ఈ విషయంలో వేణు ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. 

Also read :  రెచ్చిపోయిన యువకులు.. మహిళా ఎస్‌ఐ జట్టు పట్టుకుని రచ్చ

ఫోన్ గుంజుకుని కర్రతో దాడి

 అయితే అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన వేణు భార్య దీనంతా వీడియో రికార్డింగ్ చేస్తుండగా ఆమె ఫోన్ గుంజుకుని ఈ గొడవకు అసలు కారణం నువ్వేనంటూ ఆమెపై కర్రతో దాడి చేశాడు. అప్పుడే కారులో ఇంటికి వచ్చిన వేణు తన భార్యను కొట్టడంతో ఆగ్రహించి అన్న సంతోష్ పై దాడికి దిగాడు. గల్లాలు పట్టుకుని మరి ఇద్దరూ వీధుల్లో రౌడీల్లా రెచ్చిపోయి మరీ కొట్టుకున్నారు.  వేణు స్నేహితులు సంతోష్ కు  ఎంతో నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ అతను వినిపించుకోలేదు. 

Also read :  యూట్యూబ్ చూసి స్మగ్లింగ్ నేర్చుకున్నా..రన్యారావు స్టేట్ మెంట్

సంతోష్ పై కేసు నమోదు

పైగా వేణు కారు అద్దాలను కూడా ధ్వంసం చేశాడు సంతోష్ .  అనంతరం  బావ మరదలు ఇద్దరు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరస్పరం ఒకరిపై మరోకరు ఫిర్యాదులు చేసుకున్నారు.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వేణు భార్యను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్రమంగా ఇంట్లోకి చొరబడటమే కాకుండా మహిళపై దాడి చేసినందుకు గానూ కానిస్టేబుల్ సంతోష్ పై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ డి ఆంజనేయులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.   

Also Read :  పెరగనున్న ఇంజినీరింగ్ ఫీజులు.. ఈ కాలేజీల్లో మీ పిల్లలున్నారా?

Also read :  నన్ను మతం మార్చుకోమన్నారు: డానిష్‌ కనేరియా సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు