Cryptocurrency Fraud: 96 బిలియన్ డాలర్ల స్కాం.. ఇంటర్‌నేషనల్ క్రిమినల్‌ని అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు

లిథువేనియ దేశానికి చెందిన బెస్సియోకోవ్ అమెరికా మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ లిస్ట్‌లో ఉన్నాడు. ఆర్థికనేరాలకు పాల్పడి 96 బిలియన్ డాలర్ల స్కాం చేసినట్లు అమెరికా పోలీసులు ఆరోపిస్తున్నారు. అతన్ని కేరళా పోలీసులు బుధవారం తిరువనంతపురంలో అరెస్ట్ చేశారు.

New Update
Aleksej Besciokov

Aleksej Besciokov Photograph: (Aleksej Besciokov)

అమెరికాలో భారీ స్కామ్‌కు పాల్పడిన వ్యక్తిని బుధవారం కేరళా పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిప్టోకరెన్సీ మోసానికి పాల్పడినందుకు లిథువేనియకు చెందిన బెస్సియోకోవ్ అమెరికాలో మోస్ట్ వాంటెండ్ క్రిమినల్‌గా ఉన్నాడు. అతన్ని కేరళలో అరెస్టు చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. నిందితుడు అలెక్సేజ్ బెస్సియోకోవ్, రాన్సమ్‌వేర్, కంప్యూటర్ హ్యాకింగ్, మాదకద్రవ్యాల లావాదేవీలు వంటి లూటీలు చేస్తూ వచ్చే ఆదాయాన్ని లాండరింగ్ చేయడానికి గ్యారంటెక్స్ అనే క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్‌ను ఏర్పాటు చేశాడట.

US సీక్రెట్ సర్వీస్ ప్రకారం.. బెస్సియోకోవ్ దాదాపు 6 సంవత్సరాల్లో గారంటెక్స్‌ నడిపించాడని ఆరోపణలు ఉన్నాయి. ఇది అమెరికా ఆంక్షలు ఉల్లంఘించి ఉగ్రవాద సంస్థలు సహా కనీసం $96 బిలియన్ల క్రిప్టోకరెన్సీ లావాదేవీలకు మనీలాండరింగ్‌ చేసింది. దీనివల్ల గ్యారంటెక్స్ వందల మిలియన్ల ఇల్లీగల్ మనీ పొందింది. హ్యాకింగ్, రాన్సమ్‌వేర్, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి వివిధ నేరాల్లో డబ్బులు ఈ మనీలాండరింగ్ ద్వారా జరిగాయని అమెరికా పోలీసులు చెబుతున్నారు. అతడు యుఎస్ కోడ్ టైటిల్ 18ని ఉల్లంఘించి మనీలాండరింగ్‌, యుఎస్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్‌ను ఉల్లంఘించడానికి కుట్ర అంతేకాకుండా లైసెన్స్ లేని మనీ సర్వీసెస్ వ్యాపారాన్ని నిర్వహించాడని అమెరికా ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 2022లో అమెరికా అతనిపై ఆంక్షలు విధించింది.

Also read: Paris: బట్టలు లేకుండా రోడ్లెక్కి మహిళల నిరసన.. ఎందుకంటే?

2025 మార్చి రెండో వారంలో అమెరికా అధికారుల అభ్యర్థన మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖకు తాత్కాలిక అరెస్ట్ వారెంట్ అందింది. దీంతో CBI, కేరళ పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేసి తిరువనంతపురంలో బెస్సియోకోవ్‌ను అరెస్టు చేశారు.

Advertisment
తాజా కథనాలు