BREAKING : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ...ఏడుగురు స్పాట్

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బద్నావర్-ఉజ్జయిని రోడ్డులోని బామన్సుత గ్రామ సమీపంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

New Update
mp accident

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బద్నావర్-ఉజ్జయిని రోడ్డులోని బామన్సుత గ్రామ సమీపంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న గ్యాస్ ట్యాంకర్  - కారు, పికప్ ట్రక్కులను - ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, గాయపడిన ముగ్గురిని వెంటనే బద్నావర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని రత్లాంకు తరలించారు.

Also read :  పెరగనున్న ఇంజినీరింగ్ ఫీజులు.. ఈ కాలేజీల్లో మీ పిల్లలున్నారా?

Also read :   హోలీ రోజు పోలీసుల ఆంక్షలు.. అలా చేస్తే కేసులు పెడతామంటూ వార్నింగ్

అధిక వేగం, ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేయడానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ప్రాథమిక దర్యాప్తులో, అధిక వేగం, ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతుల్లో మందసౌర్, రత్లం మరియు జోధ్‌పూర్ నివాసితులు ఉన్నారు.   ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ కూడా కొంతసేపు స్తంభించిపోయింది, పోలీసులు క్రేన్ సహాయంతో వాహనాలను తొలగించి పునరుద్ధరించారు.

Also Read :  నన్ను మతం మార్చుకోమన్నారు: డానిష్‌ కనేరియా సంచలన వ్యాఖ్యలు

Also read :  పాక్ ఆటగాళ్లకు బిగ్ షాక్.. 75 శాతం ఫీజుల్లో కోత విధించిన బోర్డు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు