HYD: హైదరాబాద్ లో దారుణం..హోలీ పేరుతో యాసిడ్ దాడి
హైదరాబాద్ లో హోలీ రోజు దారుణం జరిగింది. సైదాబాద్ లోని భూలక్ష్మీ మాతా గుడిలో అకౌంటెంట్ పై యాసిడ్ దాడి జరిగింది. హ్యాపీ హోలీ అని చెప్పి గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ తో దాడి చేశాడు.
హైదరాబాద్ లో హోలీ రోజు దారుణం జరిగింది. సైదాబాద్ లోని భూలక్ష్మీ మాతా గుడిలో అకౌంటెంట్ పై యాసిడ్ దాడి జరిగింది. హ్యాపీ హోలీ అని చెప్పి గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ తో దాడి చేశాడు.
పరిగి శివారులోని మల్కాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సు సైడుకు ఆపే క్రమంలో మట్టి కుంగి బస్సు అదుపుతప్పి ప్రమాదం జరిగింది. 30 మందికి పైగా స్వల్ప గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులో మొత్తం 90 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
కడప జిల్లా మైదుకూరు మండలం కేశలింగయ పల్లె వద్ద ఆగి ఉన్న స్కూటర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మైదుకూరు పట్టణానికి చెందిన చలమయ్య, లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. పొలం పనులు చూసుకొని తిరిగి వస్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది.
హైదరాబాద్ లో మరోసారి గంజాయి కలకలం రేపింది. హోలీ ముసుగులో గంజాయి ఐస్ క్రీమ్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాతో తయారుచేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్స్, బాల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు.
కామారెడ్డి జిల్లా బిక్నూర్ కానిస్టేబుల్ కేసులో మరిన్ని దారుణాలు బయటకొస్తున్నాయి. సొంత తమ్ముడి భార్య, పిల్లలపై సంతోష్ దాడి చేస్తుంటే స్థానికులు వీడియో తీశారు. దీంతో నడి బజారులోనే ప్యాంటు విప్పి తీసుకొండని చూపించాడు. ఇది వైరల్ అవుతోంది.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి పనులు చేస్తున్న వాహనాన్ని శాంట్రో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.
ఉత్తరప్రదేశ్ అయోధ్యలో దారుణం జరిగింది. ఉదయం పెళ్లి చేసుకుని భారీ ఊరేగింపుతో ఇళ్లు చేరిన నవదంపతులు ప్రదీప్, శివాని అదే రాత్రి మరణించడం సంచలనం రేపుతోంది. మొదట ఆమె గొంతుకోసి వరుడు ఉరేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
పొరుగింటి ప్రసాద్‌తో గొడవ కారణంగా సతీష్ అనే వ్యక్తి తన కారుతో ఢీకొట్టి హత్యాయత్నంకు పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రసాద్‌ను లేపేయాలన్న కసితో సతీష్ తన కారుతో డ్యాష్ ఇచ్చాడు. ఈ ప్రమాదంలో ఓ మహిళ సైతం గాల్లోకి ఎగిరి గోడ గజాలలో చిక్కుకుంది.