/rtv/media/media_files/2025/03/14/hDAmVosb10Ztsu5B80Q9.jpg)
Road Accident West Godavari
AP Crime: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై జాతీయ రహదారి పనులు చేస్తున్న వాహనాన్ని శాంట్రో కారు ఢీకొంది. కారు ఏలూరు వైపు నుంచి తణుకు వైపు వెళ్తునట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.
తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
— RTV (@RTVnewsnetwork) March 14, 2025
జాతీయ రహదారి పనులు చేస్తున్న వాహనాన్ని ఢీ కొట్టిన ఏలూరు వైపు నుంచి తణుకు వైపు వెళ్తున్న శాంట్రో వాహనం
ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు ప్రయాణికులు,మరో ఇరువురిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో… pic.twitter.com/36WaJZuVx9
గాయపడిన క్షతగ్రాతులను తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో బాలిక మృతి చెందగా, మరొకరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద పరిస్థితిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: 40 ఏళ్ల తర్వాత కూడా యంగ్‌గా కనిపించాలంటే ఇలా చేయండి