Hyd Drugs: గంజాయి ఐస్క్రీమ్‌తో ఎంజాయ్.. హోళీ వేడుకల్లో పోలీసులకు చిక్కకుండా ప్లాన్.. షాకింగ్ వీడియో!

హైదరాబాద్ లో మరోసారి గంజాయి కలకలం రేపింది. హోలీ ముసుగులో గంజాయి ఐస్ క్రీమ్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాతో తయారుచేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్స్, బాల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. 

New Update
ganja icecream

Hyderabad Ganja ice creams gang arrest

Hyd Drugs: హైదరాబాద్ నడిబొడ్డున మరోసారి గంజాయి కలకలం రేపింది. హోలీ ముసుగులో గంజాయి ఐస్ క్రీమ్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయితో తయారుచేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్స్, బాల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. 

 

ధూల్పేట్ మల్చిపురాలో..

ఈ మేరకు నగరమంతా రంగుల్లో మునిగితేలుతుంటే లోయర్ ధూల్పేట్ మల్చిపురాలో మాత్రం కొంతమంది గంజాయి మత్తులో ఊగుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గంజాయితో తయారు చేసిన 100 కుల్ఫీ, 72 బర్ఫీ స్వీట్లు, సిల్వర్‌ కోటెడ్‌ బాల్స్‌ను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మే సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి గంజాయి మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్ముతున్నట్లు ఎక్సైజ్ఎన్ ఫోర్స్ మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. సత్యనారాయణపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్ చేపట్టిన పోలీస్ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలాసన్ రెడ్డి ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: ఈ రోజు నుంచి అల్పాహారంలో ఇవి ట్రై చేయండి.. బరువు ఇట్టే తగ్గిపోతారు

ఇదిలా ఉంటే.. హోలీ సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున స్పెషల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. హోటల్స్, పబ్, రిసార్టుల్లో పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ ఈవెంట్ నిర్వాహకులు సినీ తారలు రాబోతున్నారంటూ హంగామా చేశారు. కస్టమర్లను ఆకర్షించేలా హోర్డింగ్ ఏర్పాటు చేసి టికెట్లు విక్రయించారు. భారీగా డబ్బులు వసూల్ చేసి చేతులెత్తయడంతో జనాలంతా లబోదిబోమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: ఈ మూడు స్మూతీలతో నెల రోజుల్లో బరువు తగ్గొచ్చు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు