CAR ACCIDENT: వీడేం మనిషండీ బాబు.. పొరుగింటి వారితో గొడవ.. కారుతో ఢీకొట్టడంతో తలకిందులుగా వేలాడిన మహిళ!

పొరుగింటి ప్రసాద్‌తో గొడవ కారణంగా సతీష్ అనే వ్యక్తి తన కారుతో ఢీకొట్టి హత్యాయత్నంకు పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రసాద్‌ను లేపేయాలన్న కసితో సతీష్ తన కారుతో డ్యాష్ ఇచ్చాడు. ఈ ప్రమాదంలో ఓ మహిళ సైతం గాల్లోకి ఎగిరి గోడ గజాలలో చిక్కుకుంది.

New Update
Mangalore car accident Woman Flung Into Air

Mangalore car accident Woman Flung Into Air

ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. తరచూ తన పొరుగు ఇంటి వ్యక్తితో గొడవపడుతున్న సతీశ్ పక్కా ప్లాన్ వేశాడు. ఎలాగైనా పొరుగు ఇంట్లో ఉండే వారిలో ఒకరిని లేపేయాలని ఫిక్స్ అయ్యాడు. ప్లాన్ ప్రకారమే.. కారుతో వెళ్లి పొరుగింటి వ్యక్తిని గుద్దేశాడు. అదే సమయంలో అటు వైపుగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళను సైతం గుద్దుకుంటూ పోయాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read :  పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!

ఉద్దేశపూర్వకంగా ఢీ

కర్నాటక మంగళూరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెజై-కపికాడ్‌లోని 6వ క్రాస్ రోడ్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న మురళీ ప్రసాద్ అనే వ్యక్తిని సతీష్ కుమార్ తన కారుతో ఢీ కొట్టాడు. అదే సమయంలో అటువైపుగా నడిచి వెళ్తున్న ఓ మహిళను సైతం సతీష్ తన కారుతో బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మురళీ ప్రసాద్‌కు తీవ్రగాయాలయ్యాయి. అలాగే కారు బలంగా డ్యాష్ ఇవ్వడంతో ఆ మహిళ గాల్లోకి ఎగిరి ఎదురుగా ఉన్న కాంపౌండ్ గోడ గ్రిల్‌లో చిక్కుకుంది. తలకిందులుగా వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికులు గుర్తించి ఆమెను ఆ గ్రిల్ నుంచి బయటకు తీశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

ఇద్దరి మధ్య గొడవ

కాగా రిటైర్డ్ బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి సతీష్ కుమార్ - మురళీ ప్రసాద్ ఎదురెదురుగా నివాసం ఉంటున్నారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఎలాగైనా మురళీ ప్రసాద్ అడ్డు తొలగించుకోవాలని 69 ఏళ్ల సతీష్ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్‌లో భాగంగానే బైక్‌పై వెళుతున్న మురళీని చంపేయాలనే ఉద్ధేశంతో సతీష్ తన కారుతో ఢీకొట్టాడు. అయితే ప్రమాదవశాత్తు మురళీ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సతీష్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. 

Also Read :  ఒప్పందం పై పుతిన్‌ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్‌!

ఫిర్యాదు చేసిన మురళీ

కపికాడ్‌కు చెందిన మురళీ ప్రసాద్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. ‘‘నేను బైక్ నడుపుతున్నప్పుడు. మా పొరుగువాడైన సతీష్ కుమార్ ఉద్దేశపూర్వకంగా తన కారును అతివేగంగా నడిపి, నన్ను చంపాలనే ఉద్దేశ్యంతో నా బైక్‌ను ఢీకొట్టాడు. ఆ తర్వాత ఆ కారు ఒక మహిళపైకి కూడా దూసుకెళ్లింది. సతీష్ కుమార్ తరచుగా మాతో వాదనలు పెట్టుకునేవాడు. చాలాసార్లు అసభ్యకరమైన పదజాలం ఉపయోగించేవాడు. ఒకానొక సందర్భంలో నా తండ్రిని కూడా చంపేందుకు ప్లాన్ వేశాడు. ఉద్దేశపూర్వకంగా నా తండ్రిని బైక్‌తో ఢీకొట్టి దుర్భాషలాడాడు. ఈ సంఘటనకు సంబంధించి 2023లో ఉర్వా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది’’ అని మురళీ ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

సెక్షన్లు

దీంతో మురళీ ప్రసాద్‌ను ఢీకొట్టడానికి.. నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు ఉర్వా పోలీస్ స్టేషన్‌లో BNS సెక్షన్లు 109 (ఉద్దేశంతో హత్యాయత్నం), 118 (1) (ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం నేరానికి దారితీసింది) కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు