/rtv/media/media_files/2025/01/29/u3xH7zR7SXZSfsboArOy.webp)
Road accident kadapa
AP Crime: కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మైదుకూరు మండలం కేశలింగయ పల్లె వద్ద ఆగి ఉన్న స్కూటర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మైదుకూరు పట్టణానికి చెందిన చలమయ్య, లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. పొలం పనులు చూసుకొని తిరిగి వస్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది. ద్విచక్ర వాహనంలో ముగ్గురు వస్తుండగా వెనక నుండి లారీ ఢీ కొన్నది. రెండు లారీల మధ్య ద్విచక్ర వాహనం ఇరుక్కుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తికి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: క్యాన్సర్‌ను కూడా కంట్రోల్ చేసే ఎండు ద్రాక్ష..ఇంకా ఎన్నో ప్రయోజనాలు