Conistable Crime: బరితెగించిన కానిస్టేబుల్.. బజారులో ప్యాంటు విప్పి దారుణం.. వీడియో వైరల్!

కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ కానిస్టేబుల్ కేసులో మరిన్ని దారుణాలు బయటకొస్తున్నాయి. సొంత తమ్ముడి భార్య, పిల్లలపై సంతోష్ దాడి చేస్తుంటే స్థానికులు వీడియో తీశారు. దీంతో నడి బజారులోనే ప్యాంటు విప్పి తీసుకొండని చూపించాడు. ఇది వైరల్ అవుతోంది. 

New Update
conistable km

Kamareddy Biknoor constable case another video viral

Conistable Crime: కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ కానిస్టేబుల్ కేసులో మరిన్ని దారుణాలు బయటకొస్తున్నాయి. సొంత తమ్ముడి భార్య, పిల్లలపై దాడి చేసిన సంతోష్ గౌడ్ పరమ దుర్మార్గుడని తెలుస్తోంది. వారిని కొడుతేంటే స్థానికులు వీడియో తీశారు. దీంతో నడి బజారులోనే ప్యాంటు విప్పి తీసుకొండని చూపించాడు. ఇది వైరల్ అవుతోంది. 

అసలేం జరిగిందంటే..

ఆస్తి పంపకాల విషయంలో ఏఆర్ కానిస్టేబుల్ సంతోష్ కు అతని సోదరుడు వేణుతో తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా సంతోష్ ఈ విషయంలో వేణు ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. అయితే అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన వేణు భార్య  వీడియో రికార్డింగ్ చేస్తుండగా ఆమె ఫోన్ గుంజుకుని ఈ గొడవకు అసలు కారణం నువ్వేనంటూ ఆమెపై కర్రతో దాడి చేశాడు. అప్పుడే కారులో ఇంటికి వచ్చిన వేణు తన భార్యను కొట్టడంతో ఆగ్రహించి అన్న సంతోష్ పై దాడికి దిగాడు. గల్లాలు పట్టుకుని మరి ఇద్దరూ వీధుల్లో రౌడీల్లా రెచ్చిపోయి మరీ కొట్టుకున్నారు. వేణు స్నేహితులు సంతోష్ కు ఎంతో నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ అతను వినిపించుకోలేదు. 


Also read :  యూట్యూబ్ చూసి స్మగ్లింగ్ నేర్చుకున్నా..రన్యారావు స్టేట్ మెంట్

వేణు కారు అద్దాలను కూడా ధ్వంసం చేశాడు సంతోష్. అనంతరం బావ, మరదలు ఇద్దరు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరస్పరం ఒకరిపై మరోకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వేణు భార్యను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్రమంగా ఇంట్లోకి చొరబడటమే కాకుండా మహిళపై దాడి చేసినందుకు గానూ కానిస్టేబుల్ సంతోష్ పై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ డి ఆంజనేయులు వెల్లడించారు. 

Also Read :  పెరగనున్న ఇంజినీరింగ్ ఫీజులు.. ఈ కాలేజీల్లో మీ పిల్లలున్నారా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు