Tanzania Bus Crash: రెండు బస్సులు ఢీ.. మంటల్లో కాలిబూడిదైన 40 మంది ప్రయాణికులు
టాంజానియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్యాసింజర్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం 40 మంది స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం కిలిమంజారో ప్రాంతంలోని మోషి-టాంగా రహదారిపై చోటుచేసుకుంది.