Crime: దారుణం.. అంగన్వాడీ టీచర్‌, కుమారుడి హత్య

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. శింగనమల మండలం తరిమెలలో అంగన్వాడీ టీచర్‌ యల్లమ్మ(38), ఆమె కూతురు చిన్నా (22) హత్యకు గురయ్యారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Crime

Crime

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. శింగనమల మండలం తరిమెలలో అంగన్వాడీ టీచర్‌ యల్లమ్మ(38), ఆమె కూతురు చిన్నా (22) హత్యకు గురయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. నల్లప్ప అనే వ్యక్తికి ఇద్దరు భార్యలున్నారు. ఇతని రెండో భార్య యల్లమ్మ. ప్రస్తుతం ఆమె అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. నల్లప్ప ఇటీవలే మృతి చెందాడు. దీంతో ఆస్తి విషయాల్లో ఆ కుటుంబంలో వివాదాలు తలెత్తాయి.  

Also Read: యోగి ఆధిత్యనాథ్‌ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు బ్రేక్

దీంతో మొదటి భార్య కొడుకులే యల్లమ్మ, ఆమె కొడుకుని హత్య చేశారనే అనుమానాలు తలెత్తున్నాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శింగనమల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దీనిపై విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు అందిస్తామని పేర్కొన్నారు. 

Also Read: యూట్యూబర్‌కు కట్నంగా రూ. 71 లక్షల నగదు, 21 తులాల బంగారం..వీడియో వైరల్‌..

Advertisment
తాజా కథనాలు